భర్త పుట్టినరోజుకి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన భార్య..

On
భర్త పుట్టినరోజుకి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన భార్య..

IMG-20250722-WA0104By. V. Krishna kumar
Tpn:  స్పెషల్ డెస్క్..
అతనో సాఫ్ట్ వేర్ ఉద్యోగి.. తన పుట్టినరోజు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలని అనుకున్నాడు. అయితే అతని భార్య అదిరిపోయే గిఫ్ట్ భర్తకు ఇవ్వాలనుకుంది. జీవితంలో మరిచిపోలేని బహుమతి ఇచ్చి అందరూ ఆశ్చర్యపోయేలా చేసింది. భద్రాద్రి కొత్తగూడెంకు బి. కృష్ణ కాంత్ సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్.. తన 33వ పుట్టినరోజు సందర్భంగా స్నేహితులతో గడపాలని అనుకున్నాడు. అతని భార్య శ్రీమతి ప్రణవిసాహితి, హైదరాబాద్ లో ఉన్న నెహ్రూ జూలాజికల్ పార్క్ లో ఒక నెల పాటు జాగ్వార్‌ను దత్తత తీసుకొని, తన భర్త బి. కృష్ణ కాంత్‌కు పుట్టినరోజు సందర్భంగా బహుమతిగా అందించింది.  ఈ సందర్భంగా రూ.10,000/-ను ఆన్‌లైన్ ద్వారా చెల్లించింది.  ప్రణవిసాహితి ఇటీవల మీడియా ద్వారా నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో జంతువుల దత్తత పథకం గురించి తెలుసుకొని, జూ సిబ్బందితో చర్చించిన అనంతరం తన భర్త పుట్టినరోజు సందర్భంగా జంతువు దత్తత సర్టిఫికేట్‌ను బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించారు. జూ పార్క్ అందిస్తున్న ఈ దత్తత పథకం ద్వారా ఒక నెల నుంచి ఒక సంవత్సరం వరకు వివిధ కాలవ్యవధుల ఎంపికలతో పాటు, దత్తతదారులు తమ బడ్జెట్‌కు అనుగుణంగా ఇష్టమైన జంతువును ఎంపిక చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుండటాన్ని ఆమె కొనియాడారు. అడవి జంతువులకు ఆహారం అందించటం అనేది గొప్ప అవకాశం అని పేర్కొని, ఈ అవకాశం కల్పించినందుకు జూ మేనేజ్‌మెంట్‌కు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ప్రతి ఒక్కరు సాహితిలా ఆలోచించాలని జూపార్కు అధికారులు కోరారు.

 

Advertisement

Latest News

 పండుగ రోజున మిగిలిన నాన్ వెజ్ తిని ఒకరు మృతి..7గురు సీరియస్ పండుగ రోజున మిగిలిన నాన్ వెజ్ తిని ఒకరు మృతి..7గురు సీరియస్
హైదరాబాద్: వనస్థలిపురంలో విషాదం అలుముకుంది. బోనాల పండుగకు తెచ్చుకున్న మాంసం తిని ఓ కుటుంబ సభ్యులు ఆసుపత్రిపాలైనారు. వనస్థలిపురం ఆర్టీసీ కాలనీలో నివాసం వుండే శ్రీనివాస్ ఇంట్లో...
మరో మైలురాయి దాటిన తెలంగాణ ఆర్టీసీ..
భర్త పుట్టినరోజుకి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన భార్య..
జుపే గేమ్ యాజమాన్యంపై కేసు నమోదు
అమ్మ వారికి బోనం సమర్పించిన బండ్లగూడ తహసిల్దార్ ప్రవీణ్ కుమార్
నిషా నషాలానికి ఎక్కి.. పార్కింగ్ చేసిన వాహనాలపై చూపించాడు
ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేపై చేసిన వ్యాఖ్యలను ఖండించిన బొంగునూరి కిషోర్ రెడ్డి