ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేపై చేసిన వ్యాఖ్యలను ఖండించిన బొంగునూరి కిషోర్ రెడ్డి

On
ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేపై చేసిన వ్యాఖ్యలను ఖండించిన బొంగునూరి కిషోర్ రెడ్డి

**

కుత్బుల్లాపూర్, జూలై 21. దుండిగల్ డి.పోచంపల్లిలో కాంగ్రెస్ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మైనంపల్లి హనుమంత్ రావుపై  బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ  శంభిపూర్ రాజు, ఎమెల్యే కేపీ వివేకానంద చేసిన అనుచిత వ్యాఖ్యలను కుత్బుల్లపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బొంగునూరి కిషోర్ రెడ్డి ఖండించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాడిష్ట్, డ్రగ్గిష్ట్, కోపిష్ట్ అయిన కేటిఆర్ దగ్గర ఊడిగం చేసే వారు ఇవాళ అధికార పార్టీ నాయకులను విమర్శిస్తున్నారు. ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు పదేళ్ల కాలంలో ఉద్యమ కారులకు అన్యాయం చేసి ఇంట్లో వారికి పదవులు కట్టబెట్టారు. నువ్వా ఉద్యమకారుడిని అని చెప్పుకునేది అంటూ ఘాటు విమర్శలు చేశారు. హ్యాట్రిక్ ఎమ్మెల్యే అని చెప్పుకునే కే. పీ. వివేకానంద్ కుత్బుల్లాపూర్ నియోజక వర్గానికి పదేళ్ల కాలంలో ఏం అభివృద్ధి చేశారో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నీకు రాజకీయ భిక్ష పెట్టిన వ్యక్తి మైనంపల్లి హనుమంత్ రావు, ఏ పార్టీలో ఉన్న ప్రజాశ్రేయస్సు కోసం పాటుపడే వ్యక్తి మైనంపల్లి హనుమంత్ రావు. అలాంటి వ్యక్తిని విమర్శించే స్థాయి నీకు లేదు అని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజును ఉద్దేశించి అన్నారు. మైనంపల్లి హనుమంతరావు ఒక బుక్ రాస్తా అంటే హేళనగా మాట్లాడారు. ఆ బుక్ లో ఏం రాస్తారు అంటే కేసిఆర్ చేసిన స్కామ్ లు, కేటీఆర్ లీక్స్ , కవిత లిక్కర్ స్కాం , సంతోష్ రావు హాస్పిటాలిటీ అనే పేరుతో కుంభకోణాల విషయాలని రాస్తాడని అన్నారు. నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడకపోతే, ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని కాంగ్రెస్ పార్టీ నాయకుడు బొంగునూరి కిషోర్ రెడ్డి హెచ్చరించారు.ఈ విలేకరుల సమావేశంలో సాదు యాదవ్, కుమార్ యాదవ్, కుమార్, అక్బర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Latest News

 పండుగ రోజున మిగిలిన నాన్ వెజ్ తిని ఒకరు మృతి..7గురు సీరియస్ పండుగ రోజున మిగిలిన నాన్ వెజ్ తిని ఒకరు మృతి..7గురు సీరియస్
హైదరాబాద్: వనస్థలిపురంలో విషాదం అలుముకుంది. బోనాల పండుగకు తెచ్చుకున్న మాంసం తిని ఓ కుటుంబ సభ్యులు ఆసుపత్రిపాలైనారు. వనస్థలిపురం ఆర్టీసీ కాలనీలో నివాసం వుండే శ్రీనివాస్ ఇంట్లో...
మరో మైలురాయి దాటిన తెలంగాణ ఆర్టీసీ..
భర్త పుట్టినరోజుకి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన భార్య..
జుపే గేమ్ యాజమాన్యంపై కేసు నమోదు
అమ్మ వారికి బోనం సమర్పించిన బండ్లగూడ తహసిల్దార్ ప్రవీణ్ కుమార్
నిషా నషాలానికి ఎక్కి.. పార్కింగ్ చేసిన వాహనాలపై చూపించాడు
ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేపై చేసిన వ్యాఖ్యలను ఖండించిన బొంగునూరి కిషోర్ రెడ్డి