ఏపీ పెట్టుబడులపై చర్చకు దారితీసిన ఓ యాడ్..! ఏంటా కథ?

By Dev
On
ఏపీ పెట్టుబడులపై చర్చకు దారితీసిన ఓ యాడ్..! ఏంటా కథ?

ఎక్స్ లో ఆ వీడియోను చూసిన ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేశ్‌.. ప్రకటన హృదయాన్ని హత్తుకునేలా ఉందంటూ ప్రశంసిస్తూ ట్వీట్ తో బదులిచ్చారు. మహీంద్రా వాహనాలకు అతిపెద్ద మార్కెట్‌ అయిన ఆంధప్రదేశ్‌ ప్రజలకు కూడా ఇది నచ్చుతుందని పేర్కొన్నారు. పెట్టుబడులకు అన్ని అవకాశాలున్న ఏపీలో మహీంద్రా తయారీ కేంద్రాన్ని నెలకొల్పే అంశాన్ని పరిశీలించాలని ఈ సందర్భంగా లోకేశ్ కోరారు. దీనికి ఆనంద్‌ మహీంద్రా ఈ విధంగా రీ ట్వీట్ చేశారు.ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు అనేక అవకాశాలు ఉన్నాయని ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్‌ మహీంద్రా అన్నారు. రాష్ట్రంలో సోలార్‌ ఎనర్జీ, మైక్రో ఇరిగేషన్‌, టూరిజం విభాగాల్లో పెట్టుబడులు పెట్టే అంశంపై తమ బృందాలు ఆంధ్రప్రదేశ్‌తో చర్చలు జరుపుతున్నాయని పేర్కొన్నారు. ‘మన ప్రయాణం ఇప్పుడే ప్రారంభమైంది. మున్ముందు ఏమవుతుందో చూద్దాం’ అంటూ లోకేశ్ ట్వీట్ పై  తెలుగులోనే పోస్ట్‌ పెట్టి మహీంద్ర ఆశ్చర్చపరిచారు.

Advertisement

Latest News

కంటెంట్ తో కోట్లు కొట్టేశారు.. హైదరాబాద్ పోలీసులు కటకటాల్లోకి నెట్టారు.. కంటెంట్ తో కోట్లు కొట్టేశారు.. హైదరాబాద్ పోలీసులు కటకటాల్లోకి నెట్టారు..
- శాటిలైట్ హ్యాక్ చేసి.. సినిమాలు పైరసీ చేశారు..- అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పైరసీ- ఒరిజినల్ సినిమాలకు ఏమాత్రం తీసిపోవు- తెలుగు సినీ పరిశ్రమకు రూ. 3700...
మూసీలో ఆదిత్య అక్రమ నిర్మాణం.. హైడ్రాకు పట్టని వైనం..
ఎటు చూసినా మూసీ ప్రవాహం.. హైదరాబాద్ అల్లకల్లోలం..
వారం రోజుల్లో రికార్డ్ బద్దలు కొట్టిన ఎక్సైజ్ అధికారులు
దసరా పండక్కి హైదరాబాద్ వస్తున్నారా.. అయితే ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే.
ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డిని కలిసిన అంగన్వాడి టీచర్లు
ఆ స్కూల్ లో పాఠాలు కాదు..డ్రగ్స్ తయారీ నేర్పిస్తారు..