సున్నం చెరువు వద్ద స్థలాలపై వివాదం – కోర్టు ఆదేశాలతో సర్వేకు దిగిన అధికారులు

On
సున్నం చెరువు వద్ద స్థలాలపై వివాదం – కోర్టు ఆదేశాలతో సర్వేకు దిగిన అధికారులు

మాదాపూర్ పరిధిలోని గుట్టల బేగంపేట్ సున్నం చెరువు అభివృద్ధి పనుల్లో భూ యజమానుల అభ్యంతరాలు ఎదురవుతున్నాయి. చెరువును అభివృద్ధి చేసి పార్క్, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయడంలో భాగంగా హైడ్రా అధికారులు అన్ని స్థలాలను తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. అయితే, సర్వే నెంబర్లు 12, 13లో తమకు రిజిస్టర్డ్ ప్లాట్లు ఉన్నాయంటూ కొంతమంది కోర్టును ఆశ్రయించారు.

వివాదాస్పద స్థలంలో తనకు 200 గజాల స్థలం ఉందని వి. వెంకటేష్ అనే ప్లాట్ ఓనర్ ఫిటిషన్ దాఖలు చేయగా, కోర్టు ఆ స్థలం ఎఫ్టీఎల్‌లో (ఫుల్ ట్యాంక్ లెవెల్) ఉందా లేదా అన్న విషయం పై సర్వే చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఆదేశాల మేరకు హైడ్రా ఎమ్మార్వో విజయ్, ఆర్ఐ శ్రీనివాస్, ఇరిగేషన్ ఏఈ లక్ష్మీనారాయణ గురువారం పరిశీలనకు వచ్చారు.

సైట్ సొసైటీ నిర్వాహకుడు శివ శంకరరావు మాట్లాడుతూ, సర్వే నెంబర్లు 12, 13లోని స్థలాలు రిటైర్డ్ జస్టిస్ ఆవుల సాంబశివరావు కుటుంబానికి చెందినవని, తామందరూ వారి నుంచి కొనుగోలు చేశామని పేర్కొన్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నివేదిక ప్రకారం, 2022లో చెరువు విస్తీర్ణం 15 ఎకరాలుగా నమోదు అయిందని తెలిపారు.

ఇదిలా ఉంటే, అధికారుల మాటల్లో... "పరిహారం అందిస్తున్నా, స్థానికులు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని అధికారులు వాపోతున్నారు." అన్న వాదన వినిపిస్తోంది. ఇదే ప్రాంతంలో గతంలో జరిగిన నిరసనలు, ఆత్మహత్యాయత్నాలు వివాద తీవ్రతను తెలుపుతున్నాయి.

Advertisement

Latest News

ఆ అధికారుల ఫొటోలు ట్యాంక్ బండ్ మీద పెట్టండి.. హైకోర్టు ఆ అధికారుల ఫొటోలు ట్యాంక్ బండ్ మీద పెట్టండి.. హైకోర్టు
హైదరాబాద్: అక్రమ నిర్మాణాలపై అధికారుల తీరు పట్ల తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు  చేసింది. అక్రమ నిర్మాణాల పట్ల చర్యలు తీసుకోని అధికారుల ఫోటోలను ట్యాంక్ బండ్‌పై...
విద్యావ్యవస్థపై మావోయిస్టు పార్టీ సంచలన లేఖ
పక్కా ప్లాన్ ప్రకారమే చేశా.. యాంకర్ స్వేచ్ఛ కేసులో పూర్ణ స్టేట్మెంట్.
డ్రగ్స్ దందాలో నయా ట్రెండ్.. ఇంపోర్టు టు ఎక్స్ పోర్ట్..
ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడు ఆయనే.. అధిష్టానం సంచలన నిర్ణయం
ట్రూ పాయింట్ న్యూస్ కి స్పందన.. సున్నం చెరువులో అక్రమ బోర్ల ధ్వంసం
పాశమైలారం పారిశ్రామికవాడలో భారీ ప్రమాదం