అమీర్ పేటలో డ్రగ్స్... ధూల్ పేటలో గంజాయి స్వాధీనం
హైదరాబాద్: బెంగూళూరు నుంచి తక్కువ ధరలకు డ్రగ్స్ తీసుక రావడం ఎక్కువ ధరలకు ఎండిఎంఎ డ్రగ్స్‌ను అమ్మకాలు జరుపుతున్న ముఠా సభ్యులతో పాటు కొనుగోలు దారులను ఎస్టి ఎఫ్ బి టీమ్ సిబ్బంది పట్టుకున్నారు. వరాల దీక్షిత్, కొండ బొయిన వరణ్ తేజ్ ఇద్దరు కలిసి బెంగూళూరు నుంచి తక్కువ ధరలకు ఎండీఎంఐ డ్రగ్స్ ను తీసుకువచ్చి, ఎక్కువ ధరలకు అమ్మకాలు జరుపుతుండగా సీఐ భిక్షా రెడ్డి, ఎస్ఐ బాలరాజు, సంధ్య సిబ్బంది కలిసి 6.34 గ్రాముల ఎండిఎంఎ డ్రగ్స్ ను పట్టుకున్నారు. డ్రగ్స్ ను కొనుగోలు చేయడానికి వచ్చిన భాషపాగ ప్రవీణ్‌రాజ్, ఎండి అస్లామ్ హుస్సెన్, సంగ ప్రేమ్ సాయిలు ని అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద ఉన్న రెండు బైక్‌లను, ఐదు సెల్ ఫొన్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న డ్రగ్స్‌ను, నిందితులను అమీర్‌పేట్ ఎక్సైజ్ స్టేషన్‌లో అప్పగించారు.
మరో కేసులో..1.248 కేజీల గంజాయి పట్టివేత..
ధూల్ పేట్ బలరామ్‌గల్లీలో గంజాయి అమ్మకాలు జరుపుతున్నారనే సమాచారం మేరనకు ఎస్టి ఎఫ్ఏ టీమ్ సిబ్బంది 1.248 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ధూల్‌పేట్‌కు చెందిన నలుగురిపై కేసు నమోదు చేసినట్లు టీమ్ నంద్యాల అంజి రెడ్డి తెలిపారు. దుర్గేష్ సింగ్, గూలాబ్‌సింగ్, కాళీబాయిలను అరెస్టు చేశారు. రాజుసింగ్ అనే వ్యక్తి పరారీలో ఉన్నట్లు తెలిపారు.