దాడులు ముమ్మరం చేసిన ఎక్సైజ్.. భారీగా డిఫెన్స్ మద్యం స్వాధీనం
హైదరాబాద్: ఎక్సైజ్ అధికారులు వరుస దాడులతో నగరంలో పలు చోట్ల డిఫెన్స్ మద్యాన్ని స్వాదీనం చేసుకున్నారు.
మాల్కాజి గిరిలో 30 బాటిళ్లు, ఘట్కేసర్ లో 28 డిఫెన్స్ మద్యం బాటిళ్లను సీజ్ చేశారు.
సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి ఎక్సైజ్ సూపరిండెంట్ పరిధిలో డిఫెన్స్ క్యాంటిన్లు ఉన్నచోట అక్రమంగా డిఫెన్స్ మద్యం అమ్మకాలు జోరుగా జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎక్సైజ్ సూపరింటెండెంట్ కె.నవీన్ తన పరిధిలో ఉన్న మల్కాజి గిరి, ఉప్పల్, ఘాట్కేసర్, మేడ్చల్ ఎక్సైజ్ స్టేషన్లలో డిఫెన్స్ మద్యం బాటిళ్ల చలామణి, అమ్మకాలు జరుగుతున్నాయని ప్రత్యేక నిఘా పెట్టి దాడులు జరిపారు. ఎన్‌డిపీఎల్ (నాన్ డ్యూటి పెయిడ్ లిక్కర్)పై ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్‌ఫొర్స్ మెంట్ డైరెక్టర్ షానవాజ్ ఖాసీం నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో 1188 మద్యం బాటిళ్లను పట్టుకున్నారు. ఈ బాటిళ్లలో ఎక్కువగా శంషాబాద్ డిటిఎఫ్ సీఐ ప్రవీణ్‌కుమార్ రూ.2.30 లక్షల విలువ చేసే 115 డిఫెన్స్ మద్యం బాటిళ్లను పట్టుకోగా మల్కాజ్‌గిరి ఏఈఎస్ ముకుందరెడ్డి అధ్వర్యంలో రెండు చోట్ల దాడులు నిర్వహించి 37 డిఫెన్స్ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఇక మేడ్చల్‌లో 24 ఎన్డిపిఎల్ మద్యం బాటిళ్లను పట్టుకున్నారు. మల్కాజ్‌గిరి, ఘట్కేసర్ లో 58 డిఫెన్స్ మద్యం బాటిళ్లు, మల్కాజ్‌గిరి సీఐ చంద్ర`శేఖర్ ఎస్ ఐలు కుమార స్వామి, సంద్యాతోపాటు సిబ్బంది కలిసి యాప్రాల్ అల్వాల్‌లో దున్న అనే వ్యక్తి ఫ్లాట్ లో 30 డిఫెన్స్ బాటిల్స్ ని,
ఘట్కేర్‌సర్‌లో ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో సీఐ జె.రవి, ఎస్ఐ నందిని సిబ్బంది కలిసి 28 గోవా, డిఫెన్స్ మద్యం బాటిళ్లను ఒక కారులో తరలిస్తుండగా స్వాదీనం చేసుకున్నారు. ఈ కేసులో మెరుగు నిఖిల్ అరెస్టు చేసి, కారును కూడ సీజ్ చేశారు.