నాయుడుపేటలో కూటమి ప్రభుత్వానికి ఏడాది... ఘనంగా టీడీపీ ఆధ్వర్యంలో వేడుకలు

On
నాయుడుపేటలో కూటమి ప్రభుత్వానికి ఏడాది... ఘనంగా టీడీపీ ఆధ్వర్యంలో వేడుకలు

నాయుడుపేట, జూన్ 12, 2025

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పాటుై సంవత్సరం పూర్తైన సందర్భంగా నాయుడుపేటలో టీడీపీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ సూళ్ళూరుపేట నియోజకవర్గ ఇంచార్జి నెలవల సుబ్రహ్మణ్యం, జనసేన ఇంచార్జ్ ఉయ్యాల ప్రవీణ్‌లు మాట్లాడుతూ, డబుల్ ఇంజిన్ పాలనతో రాష్ట్ర అభివృద్ధికి కొత్త దిక్సూచి ఏర్పడిందని వెల్లడించారు.

నాయుడుపేట టీడీపీ కార్యాలయంలో కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి జెండాలు ఊపుతూ ఆనందోత్సాహాలతో కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వివరాలను నాయకులు ఈ సందర్భంగా వివరించారు.

ఈ వేడుకలో మాజీ AMC చైర్మన్ విజయ్ భాస్కర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ 786 రఫీ, మండల అధ్యక్షులు చంద్ర శేఖర్ రెడ్డి, నెలవల రాజేష్, సుధీర్ (ఓజిలి), పెళ్లకూరు అధ్యక్షుడు విజయ్ కుమార్ నాయుడు, సంచి క్రిష్టయ్య, జనసేన కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Latest News

ఆ అధికారుల ఫొటోలు ట్యాంక్ బండ్ మీద పెట్టండి.. హైకోర్టు ఆ అధికారుల ఫొటోలు ట్యాంక్ బండ్ మీద పెట్టండి.. హైకోర్టు
హైదరాబాద్: అక్రమ నిర్మాణాలపై అధికారుల తీరు పట్ల తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు  చేసింది. అక్రమ నిర్మాణాల పట్ల చర్యలు తీసుకోని అధికారుల ఫోటోలను ట్యాంక్ బండ్‌పై...
విద్యావ్యవస్థపై మావోయిస్టు పార్టీ సంచలన లేఖ
పక్కా ప్లాన్ ప్రకారమే చేశా.. యాంకర్ స్వేచ్ఛ కేసులో పూర్ణ స్టేట్మెంట్.
డ్రగ్స్ దందాలో నయా ట్రెండ్.. ఇంపోర్టు టు ఎక్స్ పోర్ట్..
ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడు ఆయనే.. అధిష్టానం సంచలన నిర్ణయం
ట్రూ పాయింట్ న్యూస్ కి స్పందన.. సున్నం చెరువులో అక్రమ బోర్ల ధ్వంసం
పాశమైలారం పారిశ్రామికవాడలో భారీ ప్రమాదం