ఐఏఎస్ ఆమ్రపాలికి క్యాట్ లో ఊరట

On
ఐఏఎస్ ఆమ్రపాలికి క్యాట్ లో ఊరట

ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలికి కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (క్యాట్)లో ఊరట లభించింది. ఆమెను ఆంధ్రప్రదేశ్ కేడర్ నుండి తిరిగి తెలంగాణ కేడర్‌కు కేటాయిస్తూ క్యాట్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పరిణామంతో ఆమె త్వరలోనే తెలంగాణ ప్రభుత్వంలో బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (డీఓపీటీ) జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ఆమ్రపాలి దాదాపు నాలుగు నెలల క్రితం ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు వెళ్లారు. అయితే, దీనిని సవాల్ చేస్తూ, తనను తెలంగాణకు కేటాయించాలని కోరుతూ క్యాట్‌ను ఆశ్రయించారు. ఆమె పిటిషన్‌పై విచారణ జరిపిన క్యాట్, ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం ఆమ్రపాలి అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుంటూ ఆమెకు అనుకూలంగా తీర్పు వెలువరించింది.

Advertisement

Latest News