మహిళా సాధికారతకు నిరంతరకృషి
ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజను కలిసిన నల్లాని రాజేశ్వరి

తిరుపతి, జూన్ 7 :
మహిళల ఆత్మగౌరవ పరిరక్షణకు సమిష్టికృషి సాగించాలని ప్రముఖ సామాజికవేత్త, కేంద్ర ప్రభుత్వ "రాజ్యమహిళా సమ్మాన్" అవార్డు గ్రహీత నల్లాని రాజేశ్వరి విజ్ఞప్తి చేశారు. మహిళా సాధికారత సాధన దిశగా ప్రతిఒక్కరూ ముందుకు సాగాలని కోరారు. శనివారం తిరుపతి పర్యటనకు వచ్చిన ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజను రాజేశ్వరి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డా. శైలజకు దుశ్శలువా కప్పి, పుష్పగుచ్చం, జ్ఞాపికను అందజేశారు. బాలికా విద్య, బాలలహక్కుల పరిరక్షణ, మహిళా సాధికారత తదితర అంశాలపై తాను రాసిన వ్యాసాల సంపుటి "సాధికారత" పుస్తకాన్ని రాజేశ్వరి అందజేశారు. మూడు దశాబ్దాలుగా తాను చేస్తున్న కృషిని వివరించారు. బహుముఖ సేవలందిస్తున్న రాజేశ్వరిని డాక్టర్ శైలజ ప్రత్యేకంగా అభినందించారు. తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి దర్శనం అనంతరం ఆలయ ప్రాంగణంలో కలుసుకుని పలు విషయాలపై చర్చించారు .
Latest News
