భూభారతి చట్టంపై జూన్ 3 నుండి రెవెన్యూ సదస్సులు..
By Ravi
On

మేడ్చల్: భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం అమలులో భాగంగా జూన్ 3 నుండి రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నట్లు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని మేడ్చల్, శామీర్ పేట్, ఘట్కేసర్, మూడుచింతలపల్లి, గండిమైసమ్మ దుండిగల్ మండలాలలోని గ్రామాల వారిగా ఉదయం 9.30 గంటల నుండి సాయంత్రం 4.00 గంటల వరకు ఈ రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. ఆయా గ్రామ ప్రజలు ఏవైన భూ సమస్యలు ఉన్నట్లయితే రెవెన్యూ సదుస్సులలో రెవెన్యూ అధికారులకు అర్జీలను అందించాలని, ఇట్టి విషయాన్ని జిల్లా ప్రజలు గమనించి, సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు.
Tags: #medchalcollector#
Latest News

30 Jul 2025 09:56:49
పనుల్లో నిమగ్నమైన శామీర్పేట కళాకారులు..
గత ఏడాది అరుణాచలం..ఈ ఏడాది స్వర్ణగిరి..
ప్రతియేటా కొత్త తరహా ఏర్పాట్లతో ఆకట్టుకుంటున్న గణేష్..