వివాదాస్పద భూమిలో సర్వే చేస్తున్న రెవెన్యూ అధికారులు
By Ravi
On

మేడ్చల్ జిల్లా సుచిత్రలోని సర్వే నెంబరు 82లో గల వివాదాస్పద భూమిలో అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. మాజీ మంత్రి మల్లారెడ్డికి, ఇతర వ్యక్తులకు మధ్య నెలకొన్న భూ వివాదంలో రెవెన్యూ అధికారులు సర్వే రంగంలోకి దిగి నిజాలు నిగ్గు తేల్చే పనిలో పడ్డారు. పరస్పరం ఆ భూమి తమదేనంటూ గొడవలకు దిగుతున్నారు. ఇందులో భాగంగా ఇరువర్గాల సమక్షంలో జిల్లా రెవెన్యూ అధికారలు సర్వే చేస్తున్నారు. వివాదం స్పదంగా ఉన్న స్థలంలో గొడవలు జరగకుండా పోలీసులు ముందస్తుగా బ్యారికెడ్స్ ఏర్పాటు చేసి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇతరులను లోపలికి రానివ్వకుండా అడ్డుకున్నారు.
Tags:
Latest News

10 Aug 2025 18:00:13
పార్కింగ్ కష్టాలు తీర్చే దిశగా అడుగులు..ఆటోమేటెడ్ బహుళ అంతస్తుల పార్కింగ్ వ్యవస్థ సిద్ధం..నాంపల్లిలో 1st పేజ్ సిద్ధం చేసిన అధికారులు..