ఆర్మీకి అమిత్ షా కీలక ఆదేశాలు..

By Ravi
On
ఆర్మీకి అమిత్ షా కీలక ఆదేశాలు..

పహల్గాం ఉగ్ర దాడికి భారత బలగాలు ప్రతీకారం తీర్చుకుంటున్నాయి. ఆపరేషన్‌ సింధూర్‌ పేరిట తొమ్మిది ఉగ్ర స్థావరాలపై బుధవారం నాడు తెల్లవారు జామున విరుచుకుపడ్డాయి. ఈ దాడి తర్వాత కూడా పాకిస్తాన్ రేంజర్లు విచక్షణ రహితంగా కాల్పులు జరపడంతో.. ఈ ఘటనలో సుమారు పది మంది భారతీయ పౌరులు మృతి చెందినట్లు తెలుస్తుంది. అలాగే, పలువురు గాయపడినట్లు భారత ఆర్మీ అధికారులు చెప్పుకొచ్చారు. ఈ తరుణంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సెలవులో ఉన్న సిబ్బందిని వెనక్కి రప్పించాలని పారా మిలిటరీ బలగాలకు కేంద్రమంత్రి అమిత్‌ షా ఆదేశాలు జారీ చేశారు. 

కాగా గత నెలలో విహార యాత్రకు వెళ్లిన టూరిస్టులపై పహల్గాంలో ఉగ్రవాదులు దాడి చేసి 26 మంది ప్రాణాలు తీశారు. అప్పటి నుంచి పాకిస్తాన్ పై అన్ని వైపులా భారత్ ఒత్తిడి తీసుకురావడం స్టార్ట్ చేసింది. ఇప్పుడు పాకిస్తాన్, పీఓకేలోని ఉగ్ర స్థావరాలపై ఇండియన్ ఆర్మీ దాడి చేయడంతో ప్రపంచవ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారిపోయింది. ఉగ్రవాదులకు సరైన గుణపాఠం చెప్పారంటూ కేంద్ర ప్రభుత్వాన్ని, భద్రతా బలగాలను పలు దేశాలకు చెందిన ప్రతినిధులతో పాటు దేశ ప్రజలు కోరుతున్నారు. కాగా ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.

Advertisement

Latest News

ఫణిగిరికాలనీలోని మూసీనదిలో మొసలి.. ఫణిగిరికాలనీలోని మూసీనదిలో మొసలి..
హైదరాబాద్:- ఎల్బీనగర్ నియోజకవర్గం చైతన్యపురి డివిజన్ ఫణగిరికాలనీ ఆనుకొని ఉన్న మూసినది ఒడ్డున ఉన్న శివాలయం వద్ద ముసలి కలకలం రేగింది. మూసినది ఒడ్డున సంచరించే నాలుగు...
ఛీ..ఛీ.. ఇదేం దందారా నాయనా..
మళ్లీ రెచ్చిపోయిన సినీనటి కల్పిక..
కడప జిల్లా పోలీస్ శాఖ ఘనత
అమ్మతనాన్నే అపహాస్యం చేసిన సృష్టి సెంటర్..
అచ్చం పుష్పా సినిమాను సేమ్ టు సేమ్ దింపేశారు..
శ్రీరాముడు స్థాపించిన శివలింగం..ఆ చరిత్ర మీకోసం..