ఆలయాలలో తొక్కిసలాటలు, అపశ్రుతుల నుంచి పాఠం నేర్వరా?

By Dev
On
ఆలయాలలో తొక్కిసలాటలు, అపశ్రుతుల నుంచి పాఠం నేర్వరా?

సింహాచలం అప్పన్న సన్నిధిలో మరో నిర్లక్ష్యం, తప్పిన ప్రమాదం

 

సరిగ్గా రెండు నెలల క్రితం విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్నస్వామి చందనోత్సవంలో ఘోర అపశ్రుతి జరిగింది. స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గోడ కూలడంతో 7 మంది చనిపోవడమే కాకుండా 15 మందికి గాయాలయ్యాయి.ఈదురుగాలికి కూలిపోయేంత నాసిరకం గోడ నిర్మాణంవల్ల ఎప్పుడూ జరగని విధంగా ప్రమాదం జరిగింది.

 భక్తుల పట్ల వహిస్తు‍న్న నిర్లక్ష్యం విశాఖలోనే మరోసారి బయటపడింది.  సింహాద్రి అప్పన్న సన్నిధిలో శనివారం(జులై 5న) తొలిపావంచా వద్ద వేసిన భారీ రేకుల షెడ్డు కూలింది. స్తంభాల క్రింద కాంక్రీట్ వేయక పోవడంతో బరువు ఎక్కువై షెడ్డు కూలిందని తెలుస్తోంది. అదృష్టవశాత్తు షెడ్డు కింద ఎవరూ లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ నెల 9వ తేదీన గిరి ప్రదక్షిణ జరగాల్సి ఉండగా.. ఇప్పుడు ఈ ప్రమాదంతో ఏర్పాట్లపై భక్తులు ఆందోళన చేస్తున్నారు.  

అంతకు ముందు.. ఈ ఏడాది తిరుపతిలో జనవరి 8వ తేదీన వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ క్యూలైన్లలో తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతిచెందారు. 44 మంది తీవ్రంగా గాయపడ్డారు. 

పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఉత్సవాల నేపథ్యంలో మంత్రులంతా కట్టకట్టుకుని రివ్యూలు చేస్తున్నారు, ఐఏఎస్, ఐపీఎస్ స్థాయి ఉన్నతాధికారులు కూడా అక్కడే ఉండి దగ్గరుండి ఏర్పాట్లను ఒకటికి పదిసార్లు పర్యవేక్షిస్తున్నారు. అయినా వరుసగా చోటు చేసుకుంటున్న అపచా­రాలు, అనూహ్య ఘటనలు భక్త కోటిని తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. భక్తుల  భద్రత పట్ల సర్కారు తీవ్ర నిర్లక్ష్యాన్ని బట్టబయలు చేస్తున్నాయి.

Tags:

Advertisement

Latest News