కళ్యాణదుర్గం స్టాంప్ కుంభకోణం పై ఎమ్మెల్యే సురేంద్ర బాబు ఘాటుగా స్పందన..
*_అపోహలు నమ్మకండి...._*
*_ఆరోపణలు అవాస్తవం...._*
*_ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి అడుగు.._*
*_తప్పు చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు_*
*_రాజకీయంగా వైఎస్సార్సీపీ ఉనికి కోసమే నాపై ...మా కంపెనీ పై ఆరోపణలు _*
*_వైఎస్సార్సీపీ నాయకులు శవ రాజకీయాలు మానుకోవాలి_*
అనంతపురం జూన్ 26:
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కళ్యాణదుర్గం నియోజకవర్గం లో జరిగిన ఈ స్టాంప్ కుంభకోణం రోజుకో మలుపు తిరుగుతుంది. ఈ స్టాంప్ కుంభకోణం లో ప్రధానంగా కళ్యాణదుర్గం నియోజకవర్గ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు కు సంబంధించిన ఎస్సార్సీ ఇన్ఫ్రా డెవలపర్స్ లిమిటెడ్ సంబంధించిన పాత్ర ఉందని వారి కంపెనీ నీ కాపాడుకోవడం కోసం ఈ స్కాం ఎర్రప్ప అలియాస్ మీ సేవ బాబు మీదకు నెట్టారు అని ప్రతిపక్ష పార్టీ అయిన వైఎస్సార్ పార్టీ కళ్యాణదుర్గం నియోజకవర్గ ఇంచార్జి మాజీ ఎంపీ తలారి రంగయ్య మీడియా సమావేశం లో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు పై ధ్వజం ఎత్తారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే సురేంద్ర బాబు తలారి రంగయ్య చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. గురువారం అనంతపురం జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బీ అతిథి గృహంలో కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు, కళ్యాణదుర్గం టీడీపీ సీనియర్ నాయకులతో కలసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఎవరు తప్పు చేసినా ఉపేక్షించేది లేదునీ ఈ స్టాంప్ కుంభకోణంలో భాగస్వాములు అందరిని బయటకు తీయిస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్యే పదవిని అడ్డు పెట్టుకుని వ్యాపారాలు చేయలేదు. వ్యాపారాలు చేసిన తరువాత ప్రజాసేవ చేస్తూ రాజకీయాల్లోకి వచ్చాననే విషయం ఆరోపణలు చేస్తున్న ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని కోరారు. స్టాంపులు స్కామ్ జరిగిందన్నది నిజం.. ఈ విషయాన్ని ఎస్సార్సీ కంపెనీ బయట పెట్టె వరకు ఎవరికీ తెలియదు. మేము బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నాం కాబట్టి.. మాలో ఎలాంటి తప్పు లేదు కాబట్టి దీన్ని మేము బయటపెట్టాము.. మేము తప్పు చేసుంటే ఎందుకు దీని గురించి ఇంత ఓపెన్ గా మాట్లాడుతాము అని తెలిపారు. యర్రప్ప ఆలియాస్ మీ సేవా బాబు గవర్నర్, లోకేష్, నాతో ఫొటోలు దిగటం తప్పు అయితే మీ నాయకుడు జగన్ పై 11 ఈ డీ కేసులు ఉండి 16 నెలలు జైల్లో ఉండి వచ్చి ప్రధాని, రాష్ట్రపతి, కేంద్ర మంత్రులతో ఫొటోలు దిగడం తప్పు కాదా, నువ్వెళ్ళి ఆయనతో ఫొటోలు దిగితావ్ మరి తప్పు కాదా అని తలారి రంగయ్య ను ప్రశ్నించారు. యర్రప్ప మా పార్టీ కార్యకర్త కాదని మేము ఎక్కడ చెప్పలేదు.. మా పార్టీ కార్యకర్త కాబట్టే ఫొటో దిగాడు. ఎంత నాతో ఉన్నంత మాత్రాన యర్రప్ప తప్పుడు పనులు చేస్తే వెనకేసుకు రాలేదు. ఎస్సార్సీ సంస్థ సాదారణ ఆడిట్ లో భాగంగా డాక్యుమెంట్ల పరశీలిస్తున్న తరుణంలో ఈ స్టాంపులు తప్పు జరిగిందని మొదట పోలీసులకు పిర్యాదు చేసింది ఎస్సార్సీ సంస్థ అని తెలిపారు. అప్పటి వైసీపీ ప్రభుత్వంలోని స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ అఫ్ ఇండియా ద్వారా కర్నూల్ కు చెందిన నర్సిరెడ్డి, సాంబశివరెడ్డి రాష్ట్ర ఏజెన్సీ బాధ్యతలు తీసుకున్నారు. అందులోనే కళ్యాణదుర్గంలో యర్రప్ప అలియాస్ బాబు ఏజెన్సీ తీసుకున్నారు.
మీ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఏజెన్సీ తీసుకున్న నర్సిరెడ్డి, సాంబ శివారెడ్డిల ద్వారా మీరే చేయించారా.. ఈ యర్రప్ప అలియాస్ మీసేవా బాబును కూడా మీరు పావులా వాడుకుని ఇలా తప్పు చేయించి మాపై నిందలు వేసేందుకు మా దగ్గరకు నువ్వే పంపావా అని రంగయ్య ను ప్రశ్నించారు. హత్యలు చేసి డోర్ డెలివరీ చేసే నాయకత్వం మాది కాదని అభివృద్ధి చేయడమే మా లక్ష్యం అని ఆయన తెలిపారు.
మీ సాక్షి పత్రిక వివేకానంద రెడ్డి హత్యను గుండెపోటని, బాత్రూంలో జారీ పడ్డాడని చెబితే ఆయన కూతురే సీబీఐ విచారణ కోరింది. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు మీరు, మీ నాయకుడు పనితీరు. ఎదో ఒక రకంగా కళ్యాణదుర్గం ప్రాంతం అభివృద్ధిని అడ్డుకోవడం కోసమే వైసీపీ కుట్ర పన్నుతోంది. మా ముఖ్యమంత్రి సిట్ వేస్తారా.. సీబీఐ ఎంక్వయిరీ వేస్తారా.. ఈడీ విచారణ చేస్తారా అన్నది ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారే నిర్ణయిస్తారనీ తెలిపారు. ఎక్కడైనా ఇలాంటివి జరిగినట్లు ఎవరికైన తెలిస్తే వెంటనే సమాచారం ఇవ్వండనీ కోరారు.
గత పదిరోజుల నుంచి కర్నూల్ కి చెందిన సంస్థ ప్రతినిధులు వచ్చి విచారణ చేశారని అయితే ఆ విచారణకు సంబంధించిన రిపోర్టు పోలీసులకు కానీ, కమీషనర్ కు కానీ ఇవ్వకుండా ఉన్నారంటే, ఇందులో వారు కూడా భాగస్వాములు అయి ఉండవచ్చు వారి మీద కూడా పోలీసులకు పిర్యాదు చేస్తామనీ తెలిపారు. డైవర్సన్ పాలిటిక్స్ లో భాగంగానే ఈ దుస్ప్రచారం కు వైఎస్సార్సీపీ నాయకులు లేవనెత్తారు అని దుయ్యబట్టారు.