ఆపరేషన్ ధూల్పేట్ సక్సెస్.. భారీగా గంజాయి స్వాధీనం
ఆపరేషన్ ధూల్పేట కొనసాగుతోంది. ఎక్సైజ్ అధికారులు రెండు చోట్ల దాడులు చేసి భారీగా గంజాయి స్వాదీనం చేసుకున్నారు. ఎక్సైజ్ శాఖ టాస్క్ ఫోర్స్ టీమ్స్ పోలీసులు ఎంత కంట్రోల్ చేసిన గంజాయి రవాణా ఆగడం లేదు. ఒరిస్సా నుంచి ఇద్దరు వ్యక్తులు తీసుకు వచ్చిన గంజాయిని రెండు చోట్ల అమ్మకాలు జరిపారని సమాచారం మేరకు అంజిరెడ్డి బృందం రెండు చోట్ల దాడులు నిర్వహించి పది కిలోల చొప్పున గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇందిరానగర్ లో రోహన్ సింగ్ అనే వ్యక్తి 10 కిలోల గంజాయిని పూజ గదిలో దేవుళ్ల ఫోటో వెనుక పెట్టి ప్రత్యేక పూజలు చేశాడు. ఎక్సైజ్ ఎస్టిఎఫ్ పోలీసులు రోహన్ సింగ్ ఇంట్లో మొత్తం వెతికిన ఎక్కడ గంజాయి కానరాకపోవడంతో చివరకు పూజ గదిలో పరిశీలించగా గుట్టురట్టైంది. ఈ కేసులో రోహన్ సింగ్ యశ్వంత్ సింగ్ లను అరెస్ట్ చేశారు.
వీరితో పాటు స్వప్న మండల్, రాజా వీర్ బారిక్, రోహిత్ పై కేసులు నమోదు చేసినట్లు ఎస్టిఎఫ్ టీం లీడర్ అంజిరెడ్డి తెలిపారు.
మరో కేసులో..
ధూల్పేట్ లో బలరాం గల్లి ప్రాంతంలో పవన్ సింగ్ ఇంట్లో సోదాలు నిర్వహించగా 2.186 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని దుర్గ భవాని, కౌశిక్ సింగ్, శ్వేతా బాయ్, అఖిలేష్, పవన్ సింగ్, మనో సింగులు పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.ఈ కేసులో నలుగురిని అరెస్ట్ చేయగా ఇద్దరు పరాల్లో ఉన్నట్లు తెలిపారు.