స్వామివారి సన్నిధిలో..చచ్చేలా కొట్టుకున్నారు..
By Ravi
On
తమిళనాడు: అరుణాచలం.. ఇప్పుడు ఉన్న దేవాలయాల్లో ఇది చాలా ఫేమస్ అయ్యింది. లక్షల్లో జనాలు స్వామివారి దర్శనం.. ప్రదక్షిణం కోసం వెళ్తున్నారు. మిగతారోజుల మాట సరే.. సెలవు రోజుల్లో చెప్పనక్కర్లేదు. విఫరీతమైన రద్దీ. ఆదివారం కూడా ఆలయానికి లక్షల్లో జనాలు వచ్చారు. మూడు కిలోమీటర్ల వరకు క్యూలైన్.. అంత సజావుగా సాగుతోంది అందుకునే సరికి లైన్ లో కలకలం రేగింది. క్యూలో ఏపీ, కర్నాటక భక్తుల మధ్య తోపులాట జరిగింది. మేము ముందు ఉన్నాము అంటే మేమే అంటూ మొదట మాటల యుద్ధం.. ఆ తరువాత పరస్పరం దాడులతో అరుణాచలం దద్దరిల్లిపోయింది. ఈ దాడుల్లో ఒకరి పరిస్థితి విషమంగా మారింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు దాడులకు పాల్పడిన వారిని అదుపులోకి తీసుకొని గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు.
Latest News
31 Jul 2025 06:44:14
పేదలకు దూరమవుతున్న ఆధునిక వైద్య సేవలు నిమ్స్ ‘ముఖ్యుడి' నిర్లక్ష్యంతో గాడితప్పిన పాలన కేసులు, అవినీతి ఆరోపణలు, అంతర్గత కలహాలు అల్లకల్లోలం అయినా పట్టని పాలకులు, ప్రభుత్వ...