రామాంతపూర్ లో ఘోర ప్రమాదం.. అయిదుగురు మృతి..

On
రామాంతపూర్ లో ఘోర ప్రమాదం.. అయిదుగురు మృతి..

ఉప్పల్ పీఎస్ పరిధి రామంతపూర్ గోకుల్ నగర్ లో శ్రీకృష్ణ శోభాయాత్రలో అపశృతి చోటుచేసుకుంది. శోభాయత్రా ముగింపు దశలో కరెంట్ షాక్ తో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి బాధితులను స్థానిక మ్యాట్రిక్స్ ఆస్పత్రికి తరలించారు. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలలో బాగంగా శ్రీకృష్ణ శోభాయాత్ర ముగింపు సమయంలో రథాన్ని తీసుకెళ్లే వెహికిల్ ఆగిపోవడంతో, ఓ పది మంది రథాన్ని నెడుతున్న క్రమంలో రథం పైన ఉన్న విద్యుత్ తీగలు రథానికి తాకడంతో సంఘటన జరిగింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఐదుగురు మృతదేహాలను మాట్రిక్స్ హాస్పిటల్ నుండి గాంధీ మార్చురీకి తరలించారు. గాయాలైన వారిలో ఒకరు మాట్రిక్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతుండగా, మరొకరు నాంపల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. మరో ఇద్దరు స్థానికంగా చికిత్స పొందుతున్నట్లు సమాచారం. మృతుల వివరాలు..

కృష్ణ అలియాస్ డైమండ్ యాదవ్(21), శ్రీకాంత్ రెడ్డి(35), సురేష్ యాదవ్(34), రుద్ర వికాస్(39), రాజేంద్ర రెడ్డి(45). ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Latest News

రామాంతపూర్ లో ఘోర ప్రమాదం.. అయిదుగురు మృతి.. రామాంతపూర్ లో ఘోర ప్రమాదం.. అయిదుగురు మృతి..
ఉప్పల్ పీఎస్ పరిధి రామంతపూర్ గోకుల్ నగర్ లో శ్రీకృష్ణ శోభాయాత్రలో అపశృతి చోటుచేసుకుంది. శోభాయత్రా ముగింపు దశలో కరెంట్ షాక్ తో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే...
హమ్మయ్య సిటీలో ఇక పార్కింగ్ కష్టాలు లేనట్లే..
జూలో ఘనంగా సింహాల దినోత్సవం..
మూసీ పరివాహక ప్రాంతాలకు రెడ్ అలర్ట్..
కంటిమీద కునుకులేదు.. ఇంటి వైపు చూసింది లేదు..
మీర్పేట్ లో శ్రీ గాయత్రీ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు
నగరంలో ఊపందుకున్న రాఖీ విక్రయాలు