'ఏఐ'తో దోమలు కంట్రోల్ చేస్తారా ? : మాజీ మంత్రి బుగ్గన సెటైర్లు

By Dev
On
'ఏఐ'తో దోమలు కంట్రోల్ చేస్తారా ? : మాజీ మంత్రి బుగ్గన సెటైర్లు


కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా మాజీ మంత్రి బుగ్గన ప్రశ్నలు..

2,45,000 కోట్ల బడ్జెట్‌ ఏమైంది.. అప్పులపై అడిగితే దేశద్రోహులమా?

ఏపీఎండీసి ద్వారా రూ.9వేల కోట్ల రుణానికి బదులు..ఖజానాపై 'ప్రైవేట్'కు హక్కులా? 

ఆడబిడ్డ నిధి, అన్నదాత సుఖీభవ ఇచ్చారా?. దీపం ఎంత మందికి వచ్చింది?

రాష్ట్రానికి తెచ్చిన అప్పులు ఎక్కడికి పోతున్నాయని..2,45,000 కోట్ల బడ్జెట్‌ ఏమైందని మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సూటిగా ప్రశ్నించారు. కేంద్రంలో భాగస్వామిగా ఉండి కూడా రాజధానిని ఎందుకు అభివృద్ధి చేయడం లేదని నిలదీశారు. మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి హైదరాబాద్‌లోని ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ.. సంపద సృష్టించాల్సిన కూటమి ప్రభుత్వం ఎందుకు అప్పులు చేస్తుందని  అడిగతే మేము దేశద్రోహులమా?. మీ అసమర్థతను కప్పి పుచ్చుకోవడానికి మాపై బురద చల్లడం ఎందుకు? అంటూ మాజీ మంత్రి ధ్వజమెత్తారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొగాకు, మామిడి, మిర్చి రైతుల పరిస్థితి ఏంటి?. ఉద్యోగులకు పీఆర్సీ ఏర్పాటు చేశారా?. ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు ఇచ్చే పరిస్థితి ఉందా?. ఏడాది పాలనలో ఒక్క డీఏ అయినా ఇచ్చారా? తల్లికి వందనం ఎంతమందికి ఇచ్చారు?. ఉచిత బస్సు ప్రయాణం అని హామీ ఇచ్చి  ఇప్పుడు జిల్లాల వరకే అంటూ షరతులు పెడతారా అని నిలదీశారు. డబిడ్డ నిధి, అన్నదాత సుఖీభవ ఇచ్చారా?. దీపం ఎంత మందికి వచ్చంది?. చెప్పాలన్నారు. ఖనిజాభివృద్ధి సంస్థ నిధులను కొల్లగొట్టడం దారుణమన్నారు. రాష్ట్ర ఖజానా నుంచి నిధులు తీసుకునేలా ప్రైవేట్ వ్యక్తులకు హక్కులు కల్పించడాన్ని ఏవిధంగా కూటమి ప్రభుత్వం సమర్థించుకుంటుందని అడిగారు.రాజ్యాంగ పదవిలో ఉండి, లక్ష్యంగా చేసుకుని గత ప్రభుత్వంపై రకరకాల మనుషులు మెయిల్స్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.

'ఏఐ'తో దోమలు కంట్రోల్ చేస్తారా? : బుగ్గన సెటైర్లు

కూటమి ప్రభుత్వం పవర్ పీపుల్ కదా అంటూ హుద్ హుద్ కూడా ఆపగలిగిన శక్తి ఉన్నవారంటూ మాజీ మంత్రి బుగ్గన చురకలంటించారు. ఏఐ ద్వారా దోమలను కంట్రోల్ చేయగలిగిన వారంటూ సెటైర్లు వేశారు. కరవును సైతం ఆపగలిగిన వారంటూ వ్యంగ బాణాలు సంధించారు. అప్పు చేయడం కరెక్టా కాదా సూటిగా చెప్పాలన్నారు. గత ప్రభుత్వం కోవిడ్ వల్ల తప్పి పరిస్థితుల్లో అప్పు చేస్తే తప్పని..ఇపుడు మాత్రం తప్పే కాదనేలా అప్పుల మీద అప్పులు చేస్తున్నారన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూ.10వేల కోట్ల అప్పులు ఒకేసారి చేస్తున్నారన్నారు. రూ.5 లక్షల కోట్ల అప్పుని గతంలో శ్రీలంక, వెనిజులా అంటూ రూ.14లక్షల కోట్ల అప్పయినట్లు దుష్ప్రచారం చేసిన వైనంపై మాజీ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Latest News

సంతకం ఫోర్జరీ చేసి అధ్యక్షుడు అయ్యాడు.. సంతకం ఫోర్జరీ చేసి అధ్యక్షుడు అయ్యాడు..
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్‌రావు అరెస్ట్ క్లారిటీ ఇచ్చిన సీఐడీనకిలీ పత్రాలు సృష్టించి అధ్యక్ష పదవి పొందారని ఆరోపణలుమాజీ మంత్రి కృష్ణయాదవ్ సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు...
ఆదూరాన్ని తగ్గించింది... అడ్డుగోడను తొలగించింది..
ప్రభాకర్ రావు అరెస్ట్ కోసం సుప్రీంకోర్టుకి వెళ్లిన సిట్
కల్తీ ఘటనపై స్పందించిన ఎక్సైజ్.. ఆ దుకాణాల లైసెన్స్ రద్దు..
మల్నాడు కిచెన్ డ్రగ్స్ పై ఈగల్ స్పెషల్ ఫోకస్
బెట్టింగ్ యాప్స్ బెండు తీసేందుకు రెడీ అయిన ఈడీ
పవన్ కళ్యాణ్ సవాల్.. నేను సిద్ధమన్న లోకేష్..!