మల్నాడు కిచెన్ డ్రగ్స్ పై ఈగల్ స్పెషల్ ఫోకస్
- సిటీలో పలువురు డాక్టర్లకు ఇక్కడి నుండి డ్రగ్స్ సరఫరా..
గోవా నుండి సప్లై అయినట్లు నిర్ధారణ..
కిచెన్ యజమాని సూర్య అంతర్జాతీయ స్థాయిలో డ్రగ్స్ నడుపుతున్నట్లు ఆధారాలు..
By. V. Krishna kumarT
pn: స్పెషల్ డెస్క్..
హైదరాబాద్‌లో సంచలనంగా మారిన మల్నాడు కిచెన్ డ్రగ్స్ కేసులో ఈగల్ టీమ్ ఫోకస్ పెంచింది. ఈ కేసు దర్యాప్తులో ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపింది. డ్రగ్స్ కి అలవాటు పడ్డ కస్టమర్ల లిస్ట్ సేకరిస్తోంది. అసలు ఈ మల్నాడు కిచెన్‌కు డ్రగ్స్ ఎలా చేరాయి? అక్కడ నుంచి ఎక్కడెక్కడికి డెలివరీ అయ్యాయి? ఇందులో ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. పలువురి డాక్టర్లకు కూడా మల్నాడు కిచెన్ నుంచి డ్రగ్స్ వెళ్లినట్లు ఈగల్ బృందం గుర్తించింది.
గోవాలో నైజీరియా దేశస్థుడు నిక్ నుంచి కొకైన్, ఎండీఎంఏను మల్నాడు కిచెన్ యజమాని సూర్య డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు ఈగల్ టీమ్ విచరణలో బయటపడింది. గోవా నుంచి కొరియర్ల ద్వారా డ్రగ్స్ మల్నాడు కిచెన్‌ను వచ్చేవని.. అక్కడ నుంచి పబ్‌లు, ప్రముఖులకు అవి సప్లయ్ అయినట్లు ప్రత్యేక బృందం గుర్తించింది. మల్నాడు కిచెన్ యజమాని సూర్య అంతర్జాతీయ డ్రగ్స్ రాకెట్ నడుపుతున్నట్లు ఈ విచారణలో వెల్లడయింది.
మల్నాడు కిచెన్ నుంచి ఆర్డర్ల వారీగా డ్రగ్స్‌ను సప్లయ్ చేసినట్లు ఈగల్ టీమ్ ఆధారాలు కూడా సేకరించింది. రెస్టారెంట్లతో పాటు హైదరాబాద్‌లో ఉన్న 20 పబ్బులకు ఇప్పటి వరకు డ్రగ్స్ సప్లయ్ అయ్యయాని, అలాగే పలువురు ప్రముఖులకు డోర్ డెలివరీ చేసినట్లుగా కూడా గుర్తించారు. ఈ ప్రముఖుల్లో హైదరాబాద్‌లోని కొందరు డాక్టర్లు కూడా ఉన్నట్లు ఈగల్ గుర్తించింది. డ్రగ్స్ కోసం హాస్పిటల్ ట్రీట్మెంట్ పేరుతో రూ. 1.8 లక్షల నగదు ట్రాన్స్‌ఫర్ చేసినట్లు ఈగల్ టీమ్ గుర్తించింది. శ్రీ మారుతి కొరియర్ పేరుతో డ్రగ్స్ ప్యాకెట్లు సరఫరా అయ్యయాని.. ఆడవాళ్ల చెప్పుల హీల్స్ నుంచి కొకైన్, ఎక్స్‌టసీ పిల్స్, ఓజీ కుష్ ఆయిల్‌ను ఈగల్ టీమ్ స్వాధీనం చేసుకుంది. హైదరాబాద్‌లోని 15 మంది డాక్టర్లకూ కొరియర్ల ద్వారా సూర్య ఈ డ్రగ్స్ అందజేశాడు. మూడు పబ్‌ల యజమానులతో కలిసి అప్పుడప్పుడు డ్రగ్ పార్టీలు కూడా నిర్వహించినట్లు విచారణలో తేలింది. వచ్చే వారం ముగ్గురు పబ్ యజమానులు తమ ఎదుట హాజరుకావాలంటూ నోటీసులు అందించాలనే ఆలోచనలో ఈగల్ టీమ్ ఉంది.