తుమ్మలూరు వద్ద రోడ్డుప్రమాదం.. రెండు బస్సులు ఢీ.. 30 మందికి గాయాలు
By Ravi
On
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూరు గేట్ వద్ద భారీ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కల్వకుర్తి ఆర్టీసీ బస్ , ట్రావెల్స్ బస్ ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 30మంది గాయపడినట్లు సమాచారం. ప్రమాదం జరిగేటప్పుడు బస్ లలో దాదాపు 150 మంది ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిలో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితులను ప్రత్యేక అంబులెన్స్ లలో ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం వల్ల
శ్రీశైలం రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రమాదానికి గురైన బస్ లను పక్కకి తొలగించే పనిలో పోలీసులు నిమగ్నమైనారు.
Tags:
Latest News
27 Jul 2025 13:05:00
టెస్ట్ ట్యూబ్ బేబీ పేరుతో మోసాలు..భర్తకు బదులు మరొకరి వీర్యంతో జీవితాలు ఆగం చేసిన నిర్వాహకులు..దేశవ్యాప్తంగా బ్రాంచ్ లు..సికింద్రాబాద్ లో వెలుగు చూసిన యూనివర్సల్ మోసాలు..