హెచ్సిఏ ఎన్నిక వెంటనే రద్దు చేయాలి.. టీసీఏ జిఎస్ గురువారెడ్డి డిమాండ్..
- కవిత.. హరీష్ రావు, కేటిఆర్ లపై సీఐడి చర్యలు తీసుకోవాలి
బిసిసిఐ వెంటనే రద్దు చేసి మళ్లీ ఎన్నికలు జరపాలి
నిధుల దుర్వినియోగంపై ఈడీ అసలు విషయాలు బయటకు తీయాలి
By. V. Krishna kumar
Tpn: స్పెషల్ డెస్క్..
హెచ్సీఏ ఎన్నికను వెంటనే రద్దు చేసి తిరిగి ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ప్రధానకార్యదర్శి ధరం గురువారెడ్డి డిమాండ్ చేశాడు. బీసీసీఐ రాజ్యాంగం ప్రకారం సంస్థలు అసోసియేట్ మెంబర్ క్యాటగిరీలోకి వస్తాయి. వీరికి ఓటింగ్ హక్కులు ఉండకూడదు. కానీ హెచ్‌సీఏ మాత్రం వాటికి ఓటింగ్ హక్కును ఇస్తోంది. ఉదాహరణకు రైల్వే ప్రొమోషన్ బోర్డు వంటి సంస్థలు ఓటింగ్‌లో పాల్గొన్నాయి. కానీ సభ్యత్వ నియమాలు ప్రకారం ఏజీఎం లేదా ఎస్‌జీఎంలో పాల్గొనే ప్రతినిధి తప్పనిసరిగా ఆ సంస్థ తరఫున క్రికెట్ ఆడిన ఆటగాడే కావాలి. ఆయన్ను ఆ సంస్థ లేదా బోర్డు ఆటగాళ్ల ప్యానెల్ ద్వారానే ఎన్నిక చేయాలన్నారు. అలాగే నామినేట్ చేసిన వ్యక్తులు ఓటింగ్‌లో పాల్గొనడం అనధికారికం కాబట్టి భారత సుప్రీం కోర్టు ఆమోదించిన జస్టిస్ లోధా కమిటీ సంస్కరణల ప్రకారం, బీసీసీఐలో మంత్రులు మరియు ప్రభుత్వ ఉద్యోగులు క్రికెట్ బోర్డు వ్యవహారాలలో పాలుపంచుకోవడాన్ని నిషేధించింది. ఐఏఎస్ మరియు ఐపీఎస్ అధికారులు హెచ్‌సీఏ బోర్డు లేదా జనరల్ బాడీ సమావేశాల్లో పాల్గొనడం చట్ట విరుద్ధం. అయితే 20-10-2023న జరిగిన హెచ్‌సీఏ ఎన్నికల కోసం న్యాయమూర్తి ఎల్. నాగేశ్వరరావు నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఓటర్ల జాబితాని తప్పుబట్టి, అనేక సంస్థలు తాము నామినేట్ చేసిన శాఖాధిపతులను (ఐఏఎస్, ఐపీఎస్) ఓటర్లుగా పంపడం జరిగింది. ఇది పూర్తిగా చట్టవిరుద్ధమన్నారు. సుమారు 23 సంస్థలు, ఓటు హక్కున్న వారి స్థానంలో అర్హతలేని అధికారుల ద్వారా ఓటింగ్ చేయించాయి. జగన్ మోహన్ రావు, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ తరఫున ఇలాగే చేశారని, 47 సంస్థలు, మునుపటి మంత్రులైన కేటీఆర్, హరీష్ రావు మరియు ఎమ్మెల్సీ కవిత ఒత్తిడి వల్ల ఓటింగ్ చేయాల్సి వచ్చిందచేంజ్, ఈ ముగ్గురు జగన్ మోహన్ రావును గెలిపించాలనే ఉద్దేశంతో వ్యవహరించారని చెప్పారు. ఇలాంటి అక్రమ ఓటింగ్ వల్లే జగన్ మోహన్ రావు గెలిచారు.ఒక అధికారిణి నుంచి వచ్చిన సమాచారాన్ని బట్టి, కేటీఆర్, కవిత, హరీష్ రావుల ఒత్తిడి వల్లే ఎన్నికా అధికారి సంపత్ కుమార్ చట్టవిరుద్ధంగా ఓటింగ్‌ను అనుమతించారని, ఆయన మాజీ చీఫ్ ఎలెక్షన్ కమిషనర్ అయినా సరే, చట్ట విరుద్ధ ఎన్నికను జరిగిపోవడానికి అనుమతించడం అనేది విచారణకు లోబడి ఉండాలని చెప్పారు. అందుకే 20-10-2023న జరిగిన హెచ్‌సీఏ ఎన్నికలను చెల్లుబాటు కానివిగా ప్రకటించాలని, హెచ్‌సీఏ నిబంధనలను రద్దు చేసి, దాని సభ్యత్వాన్ని బీసీసీఐ నుండి తొలగించాలని, ఎన్నికా అధికారిగా వ్యవహరించిన శ్రీ సంపత్ కుమార్, మాజీ మంత్రులు కేటీఆర్, కవిత మరియు హరీష్ రావు లను సీఐడి విచారణలో చేర్చాలని డిమాండ్ చేశారు. సీఐడి మరియు ఈడీ ఈ మోసాల వెనుక ఉన్న వారిని వెలికితీయాలని, బీసీసీఐ నిధులను దోచుకోవడానికి, బ forgery, corruption, బోర్డు ఆధిపత్యం కోసం జరిగిన కుట్రను విచారించాలని విజ్ఞప్తి చేశారు. సుమారు 155 క్లబ్‌లు, సంస్థలు, జిల్లాల సంఘాలు — జస్టిస్ లోధా సంస్కరణలు పాటించడం లేదు. హెచ్‌సీఏ జనరల్ బాడీకి 3/4 వంతు సభ్యులు అర్హులు కాదన్న విషయం స్పష్టంగా కనిపిస్తోంది. అటువంటి స్థితిలో హెచ్‌సీఏ కొనసాగడం సరికాదు. అందువల్ల, రాష్ట్ర ప్రభుత్వం మరియు బీసీసీఐ తక్షణమే జోక్యం చేసి, బీసీసీఐ, టీసీఏ ప్రతినిధులతో కూడిన స్వచ్ఛమైన, పారదర్శకమైన క్రికెట్ పరిపాలన కోసం కమిటీని ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.