ఏప్రిల్ 27న నిర్వహించే సభ స్థల పరిశీలన చేసిన హరీష్ రావు

By Ravi
On
ఏప్రిల్ 27న నిర్వహించే సభ స్థల పరిశీలన చేసిన హరీష్ రావు

హనుమకొండ : బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏప్రిల్ 27న బిఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకులు,తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్  హాజరయ్యే బహిరంగ సభకు స్థల పరిశీలనకు హనుమకొండకు మాజీ మంత్రి  తన్నీరు హరీష్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు హరీష్ రావు కు స్వాగతం పలికారు. సభ స్థలాన్ని పరిశీలించిన వారిలో పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, స్టేషను ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య, భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి, మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, బిఆర్ఎస్ జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Advertisement

Latest News