హయత్ నగర్ లో రోడ్డుప్రమాదం.. కానిస్టేబుల్ మృతి

On
హయత్ నగర్ లో రోడ్డుప్రమాదం.. కానిస్టేబుల్ మృతి

రంగారెడ్డి: హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్ద అంబర్పేట్ వద్ద చోటు చేసుకున్న ఘటనలో యాదగిరిగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తున్న రామావత్ మాన్ సింగ్ (43) మృతి చెందాడు.  విధులు ముగించుకుని తొర్రూర్ లోని తన నివాసానికి వెళ్తుండగా, పెద్ద అంబర్పేట్ వద్ద ముందు వెళ్తున్న టిప్పర్ లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతో సడన్ బ్రేక్ వేయడంతో ప్రమాదం జరిగింది.  దీంతో మాన్ సింగ్ అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు డెడ్ బాడీని ఉస్మానియా మార్చురీకి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.IMG-20250620-WA0018

Advertisement

Latest News