TTD: చర్చిలు, మసీదుల్లో హిందువులకు ఉద్యోగాలిస్తారా..? టీటీడీపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

By PC RAO
On
TTD: చర్చిలు, మసీదుల్లో హిందువులకు ఉద్యోగాలిస్తారా..? టీటీడీపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

టీటీడీపై బండి సంజయ్ హాట్ కామెంట్స్

తిరుమలలో అన్యమత ఉద్యోగులు ఎందుకున్నారని ప్రశ్న

తిరుమల తిరుపతి దేవస్థానంపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన జన్మదినం సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బండి సంజయ్.. తిరుమల తిరుపతి దేవస్థానంలో వెయ్యి మందికిపైగా అన్యమతస్తులకు ఏ విధంగా ఉద్యోగాలిచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు చేశారు. మసీదులు, చర్చిల్లో బొట్టుపెట్టుకునే హిందువులకు ఉద్యోగాలిస్తారా? అని ప్రశ్నించారు. ప్రభుత్వాలు, పాలకులు మారినా ఆ అనవాయితీని ఎందుకు కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. తక్షణమే వాళ్లను ఉద్యోగాలనుండి తొలగించాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ లో భూమిపూజ చేసిన శ్రీవెంకటేశ్వరస్వామి దేవాలయాన్ని వెంటనే నిర్మించాలని కోరారు. ఇల్లందకుంట రామాలయం, కొండగట్టు అంజన్న ఆలయాలకు ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలన్నారు. 

తెలుగు రాష్ట్రాల్లో కనీసం ధూపదీప నైవేద్యాలకు నోచుకోని దేవాలయాలను, అభివ్రుద్ధికి నోచుకోని పురాతన దేవాలయాలను గుర్తించి టీటీడీ నిధులను కేటాయించి యుద్ద ప్రాతిపదికన ప్రణాళిక రూపొందించి అభివృద్ధి చేయాలని కోరారు. తిరుమల హిందువుల ఆస్తి అని.. విదేశీయులు, అన్యమతస్తులు స్వామివారిని దర్శించుకోవాలంటే డిక్లరేషన్ తప్పనిసరి చేయాలన్నారు.

టీటీడీలో వెయ్యి మందికిపైగా ఇతర మతస్తులు ఉద్యోగాలు చేస్తున్నారని.. వారికి హిందూ మతంపై, దేవుడిపై నమ్మకం లేదన్నారు. అలాంటి వాళ్లకు కొండపై ఉద్యోగాలివ్వమేంటి? వాళ్లను కొనసాగించడమేంటి? ఇట్లాంటి పద్దతి మంచిది కాదన్నారు. ఇతర మతస్తులు టీటీడీలో పనిచేస్తున్నందున ఆచార వ్యవహారాల్లో తేడా వస్తోందని.., స్వామివారిపై నమ్మకంలేని వ్యక్తులకు జీతాలిచ్చి ఎందుకు పోషిస్తున్నారని ప్రశ్నించారు.

Advertisement

Latest News