జననాయగన్‌ తమిళనాడు థియేట్రీకల్ రైట్స్..

By Ravi
On
జననాయగన్‌ తమిళనాడు థియేట్రీకల్ రైట్స్..

దళపతి విజయ్ త్వరలో పూర్తీ స్థాయి పోలిటికల్ ఎంట్రీ ఇవ్వ్వబోతున్నాడు. ఈ నేపధ్యంలో తన సినీ కెరీర్ లో తన లాస్ట్ మూవీ జన నాయగన్‌ లో నటిస్తున్నాడు విజయ్. ఈ సినిమాకు వినోద్ దర్శకత్వం వహిస్తుస్తుండగా పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే మలయాళ నటి మమిత బైజు కీ రోల్ లో కనిపిస్తోంది. అలాగే బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ గా నటించబోతున్నాడు. కాగా ఈ సినిమా రైట్స్ కు భారీ పోటీ నెలకొంది. ఇప్పటికే జన నాయగన్‌ డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ రూ. 121 కోట్లకు కొనుగోలు చేసినట్టు టాక్. అలాగే ఈ సినిమా ఆడియో రైట్స్ ను టీ సిరిస్ కొనుగోలు చేసింది. 

ఇక ఈ సినిమా శాటిలైట్ హక్కులను కోలీవుడ్ బిగ్ ప్రొడక్షన్ హౌస్ సన్ పిక్చర్స్ కు చెందిన సన్ నెట్ వర్క్ రూ. 55 కోట్లకు దక్కించుకుంది. అలాగే తమిళనాడు థియేట్రికల్ రైట్స్ కోసం తీవ్ర పోటీ నెలకొనగా రొమోయో పిచర్స్ రాహుల్ దాదాపు రూ. 90 కోట్లకు కొనుగోలు చేసారు. విజయ్ చివరి సినిమా కావడంతో జన నాయగన్‌ రైట్స్ కోసం ఇంత డిమాండ్ ఏర్పడిందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. కోలీవుడ్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను కేవీఎన్ ప్రొడక్షన్స్ అత్యంత భారీ బడ్జెట్ పై నిర్మిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.

Advertisement

Latest News

హరిహారవీరమల్లు సినిమా సక్సెస్.. అమ్మవారికి ప్రత్యేక పూజలు హరిహారవీరమల్లు సినిమా సక్సెస్.. అమ్మవారికి ప్రత్యేక పూజలు
హైదరాబాద్: గురువారం విడుదలైన పవర్ స్టార్ పవన్ సినిమా హరిహర వీరమల్లు సక్సెస్ అయిన సందర్భంగా సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో జనసేన నాయకులు...
అల్వాల్ ట్రాఫిక్ సీఐ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం
సంకల్ప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దూలపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బూట్లు పంపిణీ
దయచేసి ఎవ్వరికి షేక్ హ్యాండ్ ఇవ్వకండి..
ఒరిస్సా టు హైదరాబాద్ గంజాయి రవాణా.. ఇద్దరి అరెస్ట్..
సినీనటుడు రాజీవ్ కనకాలకు నోటీసులు ఇచ్చిన పోలీసులు..
ప్రేమ పేరుతో యువతికి వేధింపులు.. నిందితుడి అరెస్ట్