హరిహరవీరమల్లు...అ'ధర'హో అంటున్న టికెట్ రేట్లు!

By Dev
On
హరిహరవీరమల్లు...అ'ధర'హో  అంటున్న టికెట్ రేట్లు!

పవర్ స్టార్  ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..! త్వరలోనే పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కిన హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అవుతోంది. ఈ మూవీ జూలై 24వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ధియేటర్లలో సందడి చేయబోతుంది.  హరిహర వీర మల్లు మూవీకి టికెట్ల రేట్లు పెంచుకోవటానికి అవకాశం కల్పిస్తూ కూటమి ప్రభుత్వం జీవో రిలీజ్ చేసింది.

సినిమా రిలీజ్ అయ్యే ముందురోజు  రాత్రి వేసే ప్రీమియర్ షోలకు చిత్ర నిర్మాతల విజ్ఞప్తి మేరకు ఏపీ ప్రభుత్వం టికెట్ రేట్లు ఫిక్స్ చేసింది. ప్రీమియర్ షోలకు గాను ఒక్కో టికెట్ రూ. 600గా డిసైడ్ చేసింది. దీనిపై జీఎస్టీ అదనం అని స్పష్టం చేసింది ఏపీ సర్కార్. అంతే కాకుండా సినిమా రిలీజైన రోజు నుండి పదిరోజుల వరకు టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతిచ్చింది ప్రభుత్వం. జులై 24 నుంచి ఆగస్టు 2 వరకు 10 రోజుల దాకా అన్ని థియేటర్లకు పెంచిన ధరలు వర్తిస్తాయని పేర్కొంటూ జీవో విడుదల చేసింది.

WhatsApp Image 2025-07-19 at 16.58.42

 

లోయర్ క్లాస్ టికెట్లు రూ. 100, అప్పర్ క్లాస్ టికెట్లు రూ. 150 వరకు, ముల్టీప్లెక్స్ టికెట్లు రూ. 200 వరకు వసూలు చేసుకునేందుకు అనుమతిస్తూ జీవో విడుదల చేసింది ప్రభుత్వం. దీని ప్రకారం ఏపీలో సింగిల్ స్క్రీన్ గరిష్ట టికెట్ ధర 230 నుంచి మల్టిప్లెక్స్ కి 295 వరకు ఉండే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన సాంగ్స్, టీజర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో అంచనాలు పీక్స్ కి చేరాయి. 

 

Tags:

Advertisement

Latest News