చిత్ర పరిశ్రమలో పెను విషాదం..! విలక్షణ నటులు కోటశ్రీనివాసరావు ఇక లేరు..

By Dev
On
చిత్ర పరిశ్రమలో పెను విషాదం..! విలక్షణ నటులు కోటశ్రీనివాసరావు ఇక లేరు..

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో పెను విషాదం. ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు (83) కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అస్వస్థతతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున ఫిల్మ్నగర్లోని తన నివాసంలో ఉదయం 4గం.ల సమయంలో  తుదిశ్వాస విడిచారు. తన కొడుకు మరణం తర్వాత ఆయన మానసికంగా చాలా కుంగిపోయారు. కొంతకాలంగా ఆయన సినిమాల్లో కూడా అంతగా కనిపించట్లేదు. ఎప్పుడైనా కనిపించినా.. తన పాత్ర చాలా చిన్నగా ఉండేలా ఎంచుకుంటున్నారు. 

Kota_Srinivasa_Rao_2016

 

1942 జులై 10న కృష్ణాజిల్లా కంకిపాడులో కోటా శ్రీనివాసరావు జన్మించారు. 1978లో ‘ప్రాణం ఖరీదు’తో సినీరంగంలోకి అరంగ్రేటం చేశారు. 4 దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రలు పోషించారు. సినిమాల్లో రాక ముందు ఆయన బ్యాంకులో పనిచేసేవారు. ఐతే.. సినిమాల్లో రాక ముందే ఆయన 20 ఏళ్లపాటూ రంగస్థలంలో నటించిన అనుభవాన్ని పొందారు. సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన కొత్తలో కోట శ్రీనివాసరావు తనదైన శైలిలో.. కామెడీ చేస్తూ.. పెద్దపెద్ద డైలాగులను చకచకా  పలుకుతూ..దానికి తగ్గట్లే అద్భుతంగా అభినయిస్తూ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. తన అద్భుత నటనతో అలరించిన ఆయన్ని 9 రాష్ట్ర నంది అవార్డులు, కృష్ణం వందే జగత్ గురు సినిమాకి సైమా అవార్డు, పద్మశ్రీ అవార్డు కూడా కోట శ్రీనివాసరావును వరించాయి. ఇలా 4 దశాబ్దాల పాటూ.. ఆయన సినీ ప్రజలను అలరించారు.

The_President,_Shri_Pranab_Mukherjee_presenting_the_Padma_Shri_Award_to_Shri_Kota_Srinivasa_Rao,_at_a_Civil_Investiture_Ceremony,_at_Rashtrapati_Bhavan,_in_New_Delhi_on_April_08,_2015

750కి పైగా చిత్రాల్లో నటించారు. తెలుగులోనే కాకుండా మలయాళం, కన్నడ, హిందీ, తమిళం ఇలా అన్ని భాషల్లో కూడా నటించారు కోటా శ్రీనివాసరావు. 1978లో ప్రాణం ఖరీదు సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చారు కోట శ్రీనివాసరావు. 2015లో పద్మశ్రీ అవార్డు కూడా దక్కించుకున్నారు. ఆయనకు మొత్తం తొమ్మిది నంది అవార్డులు వచ్చాయి. 1999-2004 వరకు విజయవాడ తూర్పు ఎమ్మెల్యేగా ఆయన పనిచేశారు. కోట శ్రీనివాసరావుకు ఇద్దరు కుమార్తెలు, కుమారులు కూడా ఉన్నారు.

 

 

 

OIP

తెలుగు సినీ పరిశ్రమలో.. కోట శ్రీనివాసరావు చాలా ప్రత్యేకం. విలన్ గానే కాకుండా.. ఎన్నో మంచి  కేరక్టర్లకు ఆయన ప్రాణంశారు. తనదైన నటనా శైలితో ఆకట్టుకున్నారు. కామెడీ, సీరియస్, సెంటిమెంట్.. ఇలా ఎన్నో రకాల హావభావాలు అలవోకగా పలికించారు. 

Kota-Srinivasa-Rao-9

ముఖ్యంగా.. బాబూ మోహన్ తో కలిసి.. దాదాపు 60 సినిమాల్లో నటించారు. వారిద్దరి కామెడీ టైమింగ్.. ప్రజలందరికీ నచ్చేది. 

maxresdefault

 

maxresdefault (1)Kota_Srinivasa_Rao_2016

తెలుగులో ఆయ‌న చివ‌ర‌గా 2023లో విడుద‌లైన సువ‌ర్ణ సుంద‌రి అనే చిత్రంలో క‌నిపించారు. కాగా కోట శ్రీనివాస‌రావు త‌మిళంలో 30కి పైగా చిత్రాల్లో న‌టించ‌గా హిందీలో 10, క‌న్న‌డ‌లో8, మ‌ల‌యాళ‌, డ‌క్క‌న్ భాష‌ల్లో ఒక్కో చిత్రంలో న‌టించారు. అతేగాక ఆయ‌న తెలుగులో అఖిల్ సిసింద్రీ సినిమాలో ఓరి నాయ‌నో, గ‌బ్బ‌ర్ సింగ్ సినిమాలో ముందుబాబులం అంటూ రెండు పాట‌లు సైతం పాడ‌డం విశేషం.
A-picture-of-Kota-Narsimha-Rao

రావుగోపాల రావు లాంటి నటుల తర్వాత.. వారి వారసత్వాన్ని తీసుకొని.. వెండి తెరపై తన ముద్ర వేసుకున్న కోట శ్రీనివాస రావు ఇక లేరు అనే వార్తను ఆయన అభిమానులు, సినీపరిశ్రమలోనివారు జీర్ణించుకోలేకపోతున్నారు.

Advertisement

Latest News