రసవత్తర ముగింపు దిశగా భారత్-ఇంగ్లాండ్ మూడో టెస్ట్ !
లక్ష్యం చిన్నదే అయినా తడబడుతున్న ఇండియా
135 పరుగుల లక్ష్యం..6 వికెట్లు చేతిలో..కప్ అందేనా?
భారత్-ఇంగ్లాండ్ మూడో టెస్ట్ రసవత్తర ముగింపు దిశగా సాగుతోంది. 193 పరుగుల చిన్న లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్..నాలుగో రోజు , ఆట ముగిసే సమయానికి 58 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. రాహుల్ 47 బంతుల్లో 33 పరుగులతో పోరాడుతున్నాడు. అంతకుముందు ఓవర్ నైట్ స్కోరు 2/0తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లాండ్..192 పరుగులకే ఆలౌటైంది. వాషింగ్టన్ సుందర్(4/22), సిరాజ్ (2/31), బుమ్రా (2/38) ఆతిథ్య జట్టు పతనాన్ని శాసించారు. రూట్ ఒక్కడే ఇంగ్లాండ్ జట్టులో 96 బంతుల్లో 40 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. చివరి రోజు తొలిగంటలో రాహుల్, పంత్ ఎలా ఆడతారన్నదే మ్యాచ్‌లో కీలకం కానుంది.
లక్ష్యం చిన్నదే అయినా ..ఛేదన అంత తేలిక కాదని ఇండియాకి త్వరగానే అర్థమైంది. ఇంగ్లాండ్ పేసర్లు పదునైన పేస్ తో పరీక్షించారు. ఇంగ్లీష్ బౌలర్లు ఇబ్బంది పెడుతున్నా రాహుల్, కరుణ్ నాయర్ నిలవడంతో ఓ దశలో భారత్ కుదురుకున్నట్లే కనిపించింది. కానీ 17 పరుగుల వ్యవధిలోనే మూడు వికెట్లు కోల్పోయి చిక్కుల్లో పడింది. ఇంగ్లీష్ పేసర్లను ఎదుర్కొని నిలిస్తేనే భారత్ గెలుస్తుందనడంలో సందేహం లేదు. నాలుగో రోజు ఆదివారం ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్లు ఆరంభంతో అదరగొట్టారు. బ్రూక్ అటాకింగ్ గా ఆడి భయపెట్టాడు. అయితే భాగస్వామ్యాన్ని ఆకాశ్ దీప్ బౌల్డ్ చేశాడు. రూట్, స్ట్రోక్స్ క్రీజులో పాతుకుపోయిన దశలో లంచ్ తర్వాత పరిస్థితి భారత్ కు అనుకూలంగా మారుతూ వచ్చింది. సుందర్ ఔట్ చేసిన నలుగురూ బౌల్డే కావడం విశేషం. ఇంగ్లాండ్ 38 పరుగుల వ్యవధిలో ఆరు వికెట్లు చేజార్చుకుంది.