డిజిపి కార్యాలయంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు..

By Ravi
On
డిజిపి కార్యాలయంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు..

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) కార్యాలయంలో సోమవారం ఉదయం వేడుకలు అత్యంత గౌరవప్రదంగా, దేశభక్తి భావంతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐడి మరియు ఇన్చార్జి కోఆర్డినేషన్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ ఎం. శ్రీనివాసులు, ఐపిఎస్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.రాష్ట్ర గీతాన్ని ఆలపిస్తూ జాతీయ జెండాకు గౌరవ వందనం చేశారు.

అవతరణ దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని, రాష్ట్ర సాధించిన పురోగతిని, పోలీస్ శాఖ పాత్రను గుర్తుచేస్తూ ఐజిపి అధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా  ఐ జి పి ఎం. శ్రీనివాసులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర నిర్మాణం కోసం సాగిన  పోరాటం త్యాగాలతో కూడినదని అన్నారు.ఈ రాష్ట్రం సాధించిన అభివృద్ధిలో పోలీస్ శాఖ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. శాంతి భద్రతలు సక్రమంగా ఉన్నప్పుడే అభివృద్ధి జరుగుతుందని అభిప్రాయపడ్డారు.  ఏఐజీ అడ్మిన్  నాగరాజు, అడిషనల్ ఎస్పీలు, డీఎస్పీలు, డీజీపీ కార్యాలయ అధికారులు, సిబ్బంది హాజరై  ఈ వేడుకలలో పాలుపంచుకున్నారు.

Advertisement

Latest News

 పండుగ రోజున మిగిలిన నాన్ వెజ్ తిని ఒకరు మృతి..7గురు సీరియస్ పండుగ రోజున మిగిలిన నాన్ వెజ్ తిని ఒకరు మృతి..7గురు సీరియస్
హైదరాబాద్: వనస్థలిపురంలో విషాదం అలుముకుంది. బోనాల పండుగకు తెచ్చుకున్న మాంసం తిని ఓ కుటుంబ సభ్యులు ఆసుపత్రిపాలైనారు. వనస్థలిపురం ఆర్టీసీ కాలనీలో నివాసం వుండే శ్రీనివాస్ ఇంట్లో...
మరో మైలురాయి దాటిన తెలంగాణ ఆర్టీసీ..
భర్త పుట్టినరోజుకి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన భార్య..
జుపే గేమ్ యాజమాన్యంపై కేసు నమోదు
అమ్మ వారికి బోనం సమర్పించిన బండ్లగూడ తహసిల్దార్ ప్రవీణ్ కుమార్
నిషా నషాలానికి ఎక్కి.. పార్కింగ్ చేసిన వాహనాలపై చూపించాడు
ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేపై చేసిన వ్యాఖ్యలను ఖండించిన బొంగునూరి కిషోర్ రెడ్డి