సంపూర్ణ రియల్ మార్గదర్శి ఈ పుస్తకం
స్థిరాస్తి మార్గదర్శి పుస్తకావిష్కరణలో వక్తలు
By MAHESH ARN
On
రియల్ ఎస్టేట్ రంగం పట్ల పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకోవడానికి "స్థిరాస్తి మార్గదర్శి" పుస్తకం ఎంతగానో దోహద పడుతుందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. రియల్ ఎస్టేట్ నిపుణులు కుడికాల ఓం ప్రకాష్ రచించిన 'స్థిరాస్తి మార్గదర్శి' పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం నాగోల్ లోని తెలుగు అసెట్స్ కార్యాలయంలో జరిగింది. కొత్తగా స్థలం కొనాలన్నా, ఇల్లు కట్టుకోవాలన్నా, ఏదైనా అపార్ట్మెంట్ ఎంపిక చేసుకోవాలన్నా పేరుకు తగ్గట్టే ఈ పుస్తకం ఒక మార్గదర్శిగా ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరికి సులువుగా అర్థమయ్యే విధంగా పుస్తక రచయిత ఓం ప్రకాష్ జాగ్రత్తలు తీసుకున్నారని కొనియాడారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో రచయితతో పాటు తెలుగు అసెట్స్ యూట్యూబ్ ఛానల్ శ్రీనివాస్ చీకటి, రియల్ ఎస్టేట్ నిపుణులు సామల అంజయ్య, సీనియర్ జర్నలిస్ట్ సప్తగిరి, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
Related Posts
Latest News
05 Aug 2025 16:40:58
భారత్ గౌరవ్ పేరుతో పర్యాటక టూర్ స్టార్ట్ చేసిన రైల్వే..తక్కువ ధరకు జ్యోతిర్లింగాల దర్శనం..స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అన్ని వారే చూసుకుంటారు..