ఆయన పనితీరు ఎస్టి ఎఫ్ టీమ్‌లకు ఎంతో ఉపయోగపడింది. ఎక్సైజ్ డైరెక్టర్ షానవాజ్ ఖాసీం..

హైదరాబాద్: మూడు దశాబ్దాలు పోలీస్ శాఖలో సేవలు, మూడేళ్లు ఎక్సైజ్ శాఖలో సేవలు అందించడం చాల అరుదైన విషయమని, మీ సూచనలు, సలహాలు ఎస్ టి ఎఫ్ టీమ్‌లకు ఎంతో ఉపయోగ పడ్డాయని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్‌ఫొర్స్‌మెంట్ డైరెక్టర్ షాన్‌వాజ్ ఖాసీం అన్నారు.ఎక్సైజ్ శాఖ స్టేట్ టాస్క్ ఫొర్స్, ఎన్‌ఫొర్స్‌మెంట్ విభాగాల్లో పని చేసిన అడిషనల్ ఎస్పీ బైరు భాస్కర్ కి ఎక్సైజ్‌శాఖ సమావేశ మందిరంలో పదవీ విరమణ మహోత్సవంలో జరిగింది. ఆయనకు డైరెక్టర్ షానవాజ్ ఖాసీం పుష్పగుచ్చం ఇచ్చి శాలువాతో సన్మానించారు.
ఇదే తీరులో మిగిలిన అధికారులంతా ఆయన పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషన్ కమిషనర్, జాయింట్ కమిషనర్ సయ్యద్ యాసిన్ ఖురేషి, జాయింట్ కమిషనర్ ఏబీకే శాస్త్రీ, డిప్యూటి కమిషనర్ పి.దశరథ్, అసిస్టెంట్ కమిషనర్లు ప్రణవీ, అనిల్ కుమార్‌రెడ్డి, చంద్రయ్య, డీఎస్పీలు తుల శ్రీనివాసరావు, తిరుపతి యాదావ్ , ప్రదీప్‌రావు, పంక్షారీ,కృష్ణప్రియతో పాటు సీఐలు, ఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుల్స్ పాల్గొన్నారు.
Latest News
