కంచ గచ్చిబౌలి కేసు జులై 23వ తేదీకి వాయిదా

By Ravi
On
కంచ గచ్చిబౌలి కేసు జులై 23వ తేదీకి వాయిదా

కంచ గచ్చిబౌలి భూములపై విచారణ జులై 23వ తేదీకి వాయిదా పడింది. ఈ భూముల్లో అడవులను పునరుద్దరించాలని మరో మారు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.  పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకోకపోతే సిఎస్ తో సహా  అరడజను అధికారులు అక్కడే ఏర్పాటు చేయబోయే తాత్కాలిక జైలుకు వెళ్తారని సిజెఐ బిఆర్ గవాయ్ హెచ్చరించారు. 
జులై 23 వ తేదీ లోపు గతంలో ఉన్నట్లుగా అక్కడ పర్యావరణాన్ని పునరుద్దరించాలన్న సుప్రీం ఆదేశాలు జారీ చేస్తూ తదుపరి విచారణ జులై 23 వతేదీకి వాయిదా వేసింది. విద్యార్ధులపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన కేసులను ఉపసంహరించుకోవాలంటూ దాఖలైన ఐఏను  సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.ఆ విషయంలో ప్రత్యేకంగా మరో పిటీషన్ ను దాఖలు చేయాలని, ఈ కేసులో కలపకూడదని తెలిపింది. 
గత విచారణ సందర్భంగా పర్యావరణ వన్యప్రాణుల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్తూ నాలుగు వారాల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశిస్తూ అప్పటి వరకు యధాస్థితి కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది.  ఈలోగా ఒక్క చెట్టు కూడా నరకడానికి ఒప్పుకోమన్న సుప్రీంకోర్టు, గత విచారణ సందర్భంగా వందల ఎకరాలను ఎలా పునరుద్ధరణ చేస్తారో చెప్పండని ప్రశ్నించింది. గత విచారణ సందర్భంగా కంచ గచ్చిబౌలి భూముల గురించి సుప్రీంకోర్టుకు మధ్యంతర నివేదిక  సీఈసీ అందజేసింది.

Tags:

Advertisement

Latest News

పాస్ పోర్ట్.. గల్ఫ్ వీసాలు ట్యాంపరింగ్ చేసే ముఠా అరెస్ట్ పాస్ పోర్ట్.. గల్ఫ్ వీసాలు ట్యాంపరింగ్ చేసే ముఠా అరెస్ట్
ఆర్డీజీఐఏ పోలీసులు పాస్‌పోర్ట్‌లు, గల్ఫ్ వీసాలను ట్యాంపరింగ్ చేస్తున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుండి 14 పాస్‌పోర్ట్ లు,  14 పీసీసీలు, 14 జీసీసీలు...
ఫలించిన స్పెషల్ డ్రైవ్.. రూ. 3కోట్ల మాదకద్రవ్యాలు స్వాదీనం
ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కి కోపం వచ్చింది
సరస్వతి పుష్కరాలకు మేడ్చల్ నుండి ప్రత్యేక బస్సులు
ఈ నెల 20న దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి
నకిలీ ఆధార్ కార్డుతో ప్లాట్ రిజిస్ట్రేషన్ కి యత్నం.. ఆర్టీసీ కండక్టర్ అరెస్ట్
మేడ్చల్ సొసైటీ కేంద్రం వద్ద రైతుల ఆందోళన