హీరో విజయదేవరకొండపై కేసు నమోదు

On
హీరో విజయదేవరకొండపై కేసు నమోదు

హైదరాబాద్: సినీ నటుడు విజయ్ దేవరకొండ పై రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. హీరో సూర్య నటించిన రిట్రో మూవీ ఆడియో ఫంక్షన్ లో విజయ్ దేవరకొండ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని,పాతకాలంలో గిరిజన తెగలు కొట్లాడుకున్నట్టే, ఇప్పుడు ఇండియా, పాకిస్తాన్ దేశాలు కొట్లాడుకుంటున్నాయి అనడం, ఈ వ్యాఖ్యలు గిరిజనులను కించపరిచేలా ఉన్నాయని గిరిజన సంఘాలు ఆరోపణ చేశారు. దీనిపై గిరిజనులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఆడియో ఫంక్షన్ గత నెల ఏప్రిల్లో జరిగింది. ఫిర్యాదు అందుకున్న రాయదుర్గం పోలీసులు విజయ దేవరకొండ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.

Advertisement

Latest News