ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చిన మ్యాడ్ స్క్వేర్

లేటెస్ట్ గా మన టాలీవుడ్ అందించిన సాలిడ్ హిట్ సినిమాల్లో యంగ్ హీరోస్ నార్నే నితిన్, సంగీత్ శోభన్ అలాగే రామ్ నితిన్ ల కాంబోలో వచ్చిన సాలిడ్ హిట్ మూవీ మ్యాడ్ స్క్వేర్. దర్శకుడు కళ్యాణ్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా మ్యాడ్ కు సీక్వెల్ గా తెరకెక్కింది. ముఖ్యంగా యూత్ ని టార్గెట్ గా పెట్టుకుని తీసిని ఈ సినిమా భారీ వసూళ్లను దక్కించుకుంది. ఇక ఈ సినిమా థియేటర్లు రన్ తర్వాత ఇపుడు ఫైనల్ గా ఓటీటీలో రిలీజ్ కి వచ్చేసింది.
ఈ సినిమా ఓటీటీ హక్కులు దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. మరి అందులో నేటి నుంచి ఈ సినిమా పాన్ ఇండియా భాషల్లో ఎంటర్టైన్ చేసేందుకు వచ్చేసింది. మరి ఈ సినిమాని చూడాలి అనుకునేవారు ఇపుడు నెట్ ఫ్లిక్స్ లో ట్రై చేయవచ్చు. ఇక ఈ సినిమాకి సితార ఎంటర్టైన్మెంట్స్ అలాగే ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు నిర్మాణం వహించారు. ఇక ఈ సినిమాతో మరోసారి ఈ ముగ్గురు హీరోలు తమ టాలెంట్ ను చూపించారు. సోషల్ మీడియాలో విపరీతమైన ప్రమోషన్స్ తో మూవీపై భారీ హైప్ ను క్రియేట్ చేశారు.
Latest News
