TTD: శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఆక్టోబర్ కోటా టోకెన్స్ తేదీలు ఇవే..!

By PC RAO
On
TTD: శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఆక్టోబర్ కోటా టోకెన్స్ తేదీలు ఇవే..!

తిరుమల శ్రీవారి దర్శనంపై కీలక అప్ డేట్

అక్టోబర్ కోటా తేదీలను ప్రకటించిన టీటీడీ

జూలై 19 నుంచి 24 వరకు అందుబాటులో టోకెన్లు


తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. శ్రీవారి దర్శనానికి సంబంధించి ప్రతి నెల స్పెషల్ దర్శనం, ఆర్జిత సేవలు, శ్రీవాణి, వర్చువల్ కల్యాణం టోకెన్లను టీటీడీ విడుదల చేస్తుంటుంది. ఈ క్రమంలో అక్టోబర్‌ నెలకు సంబంధించి శ్రీవారి దర్శనం, రూమ్స్ కోటా విడుదలకు సంబంధించిన షెడ్యూల్ ను టీటీడీ విడుదల చేసింది. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను జులై 19న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. ఈ-సేవా టికెట్ల ఎలక్ట్రానిక్‌ లక్కీ డిప్‌ కోసం జులై 21వ తేదీ ఉదయం 10 గంటలకు వరకు ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ-సేవా టికెట్లు పొందిన భక్తులు జులై 21 నుంచి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు డబ్బు చెల్లిస్తే లక్కీడిప్‌ టికెట్‌ మంజూరవుతుంది. 

కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, వార్షిక పుష్పయాగం టికెట్లు- జులై 22 ఉదయం 10 గంటలకు.., వర్చువల్‌ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన టికెట్లు - జులై 22 మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. అంగప్రదక్షిణం టోకెన్లు - జులై 23 ఉదయం 10 గంటలకు.., శ్రీవాణి ట్రస్టు ఆన్‌లైన్‌ కోటా టికెట్లు - జులై 23 ఉదయం 11 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారి ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్లు - జులై 23 మధ్యాహ్నం 3 గంటలకు., రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు - జులై 24 ఉదయం 10 గంటలకు., తిరుమల, తిరుపతిలో గదుల బుకింగ్‌ - జులై 24 మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వెబ్ సైట్లో భక్తులకు అందుబాటులో ఉంచుతారు. 

Advertisement

Latest News