యూరియా లో రెండు మూడు వందల కోట్ల స్కాం

On
యూరియా లో రెండు మూడు వందల కోట్ల స్కాం

NV SURYA TUNI TPN, 07-Sep-2025.

యూరియాలో రెండు మూడు వందల కోట్లు స్కాం జరిగి ఉంటుందని కాకినాడ జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దాడిశెట్టి రాజా ఆరోపించారు ఆదివారం తుని మండలం ఎస్ అన్నవరం గ్రామంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు యూరియా బ్లాక్ మార్కెట్ పై అన్నదాత పోరు పోస్టర్ ను ఆవిష్కరించి ప్రదర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలపై మాట్లాడే వారి గొంతు నొక్కే ప్రయత్నాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేస్తున్నారని రాజా విమర్శించారు  ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అసభ్యకరమైన పదజాలం వాడటం దారుణం అన్నారు సోషల్ మీడియా పై ప్రత్యేక చట్టాలు తెస్తామని బెదిరిస్తూ విపక్షాలు రైతులు విద్యార్థులు వికలాంగుల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారన్నారు మంత్రులచే రైతులపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయిస్తున్నారు యూరియా దొరకక రాష్ట్రంలో రైతులు అల్లాడిపోతున్న పరిస్థితి నెలకొందన్నారు సమస్యలను ప్రభుత్వం పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తుందన్నారు  పక్కదారి పడుతున్న యూరియా లారీలను పట్టుకున్న రైతులకు పార్టీలు అంటగడుతున్నారన్నారు ప్రభుత్వం విజిలెన్స్ అధికారులు చేయవలసిన పనిని రైతులు చేస్తుంటే పార్టీలు అందగడుతున్నారంటూ విమర్శించారు అన్ని పార్టీలలో రైతులు ఉంటారని వారిని ఏదో ఒక పార్టీకి చెందినవారిగానో అసాంఘిక శక్తులుగానో అభివర్ణించడం భావ్యం కాదన్నారు ప్రజల పక్షాన మాట్లాడే వారి పట్ల హిట్లర్ ముస్సోలినీ మాదిరిగా నియంతృత్వ ధోరణి ప్రదర్శిస్తున్నారు అంటూ విమర్శించారు మీరు సామాన్య ప్రజలను భయపెట్టవచ్చును కానీ ప్రతిపక్షాలను భయపెట్టలేరన్నారు ఎన్ని కేసులు పెట్టినా ప్రజల పక్షాన పోరాడతామన్నారు రైతులు యూరియా కొనుగోలు చేసేందుకు 200 రూపాయలు  అధికంగా చెల్లించిన దొరకని పరిస్థితి ఏర్పడిందన్నారు ఆధార్ కార్డుల ఆధారంగా యూరియా చెల్లించడం వల్ల వందలాది ఆధార్ కార్డులను వినియోగించి రైతులకు అందించాల్సిన యూరియా ను దారి మళ్లిస్తున్నారని ఆరోపించారు పట్టాదారు పాసు పుస్తకాల ఆధారంగా యూరియా పంపిణీ చేస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని సలహా ఇచ్చారు కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తర్వాత సామాన్యులకు వైద్యం అందడం లేదన్నారు  సుమారు 3700 కోట్ల ఆరోగ్యశ్రీ బకాయిలను నెట్వర్క్ హాస్పిటల్స్ కు చెల్లించకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు సామాన్యుడు వైద్యం చేయించుకునేందుకు నగానట్రా అమ్ముకోవడం లేకుంటే ప్రాణాలు కోల్పోవడం జరుగుతుందన్నారు కొన్ని నెట్వర్క్ హాస్పిటల్స్ అయితే ఆరోగ్యశ్రీలో వైద్యం అందించలేమంటూ బోర్డులు కూడా పెట్టడం జరిగింది అన్నారు అటువంటి వారిపై బెదిరింపులు దౌర్జన్యం చేయడం ద్వారా ప్రభుత్వం యొక్క అసమర్ధతను కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు ఆరోగ్యశ్రీని తొలగించి హెల్త్ ఇన్సూరెన్స్ పేరిట వేలకోట్ల రూపాయల స్కామ్ చేసేందుకు ప్రభుత్వం తెరదీసిందన్నారు ఆరోగ్యశ్రీ పెట్టిన కొత్తలో ఇన్సూరెన్స్ పాలసీలు కూడా అమలులో ఉండేదని ఇన్సూరెన్స్ కంపెనీలు క్లైమ్ సరిగా చేయక చేతులెత్తేస్తే ఇన్సూరెన్స్ విధానాన్ని నిలిపివేయడం జరిగిందన్నారు ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసే కార్యక్రమాన్ని చేయవద్దని కోరుతున్నామన్నారు గత ప్రభుత్వంలో 45 లక్షల పదివేల 645 మందికి ఆరోగ్యశ్రీ ద్వారా సేవలందించడం జరిగిందన్నారు మీ ప్రభుత్వం వచ్చిన 14 నెలల్లో ఎంతమందికి వైద్య సేవలు అందించారని ప్రశ్నించారు తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు నిర్మాణానికి అనుమతులు తీసుకువచ్చి నిర్మాణం చేపడితే వాటిని సొంత మనుషులకు అమ్మేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు ఆ ప్రయత్నాలను విరమించి ప్రజల ఆస్తులను ప్రజలకు చెందేలా కృషి చేయాలని తెలిపారు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పై పరోక్షంగా విమర్శలు చేస్తూ ప్రజలను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్న నాయకులు బాధ్యతారహితంగా మాట్లాడడం భావ్యం కాదన్నారు ఆయుధ పూజలు చేసి పిల్లలు మహిళలు ఆయుధాలు పట్టుకోవాలని అనడం మంచి పద్ధతి కాదన్నారు

Advertisement

Latest News