అనారోగ్యంతో బాధపడుతున్న ఇద్దరికి మంత్రి సుభాష్ చేయూత

By Ravi
On
అనారోగ్యంతో బాధపడుతున్న ఇద్దరికి మంత్రి సుభాష్ చేయూత

ఇరువురికి రూ.15 వేలు ఆర్థిక సహాయం

Kukkala Govinda Raju..TPN
Ramachandrapuram

రామచంద్రపురం  వివిధ కారణాలతో తీవ్ర అనారోగ్యంతో, ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఇద్దరికీ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్  ఆర్థిక సాయం అందించారు. మంగళవారం సాయంత్రం రామచంద్రపురంలోని  టిడ్ కో గృహంలో నివాసముంటున్న అలసాని ప్రసాద్ గతంలో తాపీ మేస్త్రి గా పనిచేస్తూ జీవనం సాగించేవాడు. అనుకోని రీతిలో ప్రమాదవశాత్తు భవనం పైనుంచి పడి పోవడంతో అతని వెన్నుముక బాగా దెబ్బతింది. ఈ కారణంగా నడవలేని స్థితిలో ఉన్న ప్రసాద్ పరిస్థితిని కూటమి పార్టీ నాయకుల ద్వారా తెలుసుకుని మంత్రి స్వయంగా బాధితుని ఇంటికి వెళ్లి రూ.10 వేలు ఆర్థిక సహాయం అందించారు.  ప్రసాద్ యొక్క నిస్సహాయ స్థితిని గమనించి కూటమి ప్రభుత్వం ఇచ్చే రూ.15 వేల రూపాయల పింఛను మంజూరుకు కృషి చేస్తానని మంత్రి సుభాష్ హామీ ఇచ్చారు.

అలాగే రామచంద్రపురం గుబ్బల వారి పేటకు చెందిన గుబ్బల గోపి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. మానవత్వంతో స్పందించిన మంత్రి సుభాష్ తక్షణ సాయంగా రూ. 5 వేలు అందించి, మెరుగైన వైద్యం కోసం తన ఖర్చులతో గుంటూరు ఆసుపత్రికి పంపిస్తానని హామీ ఇచ్చారు. ఇరువురి కుటుంబాల పట్ల మానవతా దృక్పథంతో స్పందించి ఆర్థిక సహాయం అందించిన మంత్రి సుభాష్ కి భాధిత  కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి సుభాష్ వెంట పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.

Tags:

Advertisement

Latest News

భారీ వర్షాల ఎఫెక్ట్: పురాతన భవనాన్ని కూల్చివేసిన అధికారులు.. భారీ వర్షాల ఎఫెక్ట్: పురాతన భవనాన్ని కూల్చివేసిన అధికారులు..
హైదరాబాద్: సికింద్రాబాద్.. రాంగోపాల్ పేట.. మెక్లవుడ్ గూడలో శిధిలావస్థకు చేరుకున్న ఒక పురాతన భవనాన్ని జిహెచ్ఎంసి అధికారులు పోలీసుల సహాయంతో కూల్చివేశారు. అయితే ఈ భవనంలో గత...
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నివాసం వద్ద భారీ బందోబస్తు
శ్రీ చైతన్య కళాశాల ఇంచార్జ్ పై కేసు నమోదు..
ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్ లో ఇద్దరు డిఎస్పీల మృతి..
హరిహారవీరమల్లు సినిమా సక్సెస్.. అమ్మవారికి ప్రత్యేక పూజలు
అల్వాల్ ట్రాఫిక్ సీఐ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం
సంకల్ప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దూలపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బూట్లు పంపిణీ