Breaking: ఏపీ లిక్కర్ స్కామ్‌లో ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్..

By PC RAO
On
Breaking: ఏపీ లిక్కర్ స్కామ్‌లో ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్..

ఏపీ లిక్కర్ స్కామ్‌లో కీలక పరిణామం

ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసిన సిట్

మిథున్ రెడ్డిని ఏ4గా పేర్కొన్న సిట్

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ (AP Liquor Scam) లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కుంభకోణంలో ప్రధాన పాత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజంపేట వైసీపీ ఎంపీ పీవీ మిథున్ రెడ్డి (YCP MP PV Mithun Reddy) ని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. శుక్రవారం సుప్రీం కోర్టులో మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేయడంతో ఆయన అరెస్ట్ ఖాయమైంది. ఈ నేపథ్యంలో శనివారం సిట్ ఎదుట విచారణకు హాజరైన మిథున్ రెడ్డిని రోజంతా ప్రశ్నించిన సిట్.. ఆ తర్వాత ఆయనకు నోటీసులు ఇచ్చి  అరెస్ట్ చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు మిథున్ రెడ్డి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది.

 

మద్యం పాలసీ రూపకల్పన, మద్యం ముడుపులను షెల్ కంపెనీలకు ఎలా తరలించింది, డిస్టిలరీలకు ఆర్డర్లు, మనీ కలెక్షన్ నెట్ వర్క్ తదితర అంశాలపై మిథున్ రెడ్డిని సిట్ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అలాగే ఇప్పటివరకు తాము సేకరించిన కీలక ఆధారాల్లో కొన్నింటిని మిథున్ రెడ్డి ఎదుట ఉంచి కీలక సమాచారాన్ని రాబట్టినట్లు సమాచారం. 

అంతకుముందు 300 పేజీలతో కూడిన ప్రలిమినరీ ఛార్జ్ షీట్ ను  కోర్టులో దాఖలు చేసింది. అందులో మిథున్ రెడ్డి ఏ4గా ఉన్నట్లు సిట్ పేర్కొంది. వందకు పైగా ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్స్, ఎలక్ట్రానిక్ పరికరాలను ఛార్జ్ షీట్ కు జత చేశారు.  ఈ కేసులో మొత్తం రూ.62  కోట్ల నగదును సీజ్ చేయగా.. 268 మంది సాక్షులను విచారించినట్లు అధికారులు ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు. 11 మంది వాంగ్మూలాలు, రిమాండ్ రిపోర్టులతో పాటు పలు కీలక డాక్యుమెంట్లను కూడా సమర్పించారు. ఈ కేసులో వివిధ బ్యాంకులు, హాస్పిటల్స్, గోల్డ్ షాపులు, రియల్ ఎస్టేట్ కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించిన స్టేటమ్ మెట్లను కూడా స్వాధీనం చేసుకున్న సిట్.. వాటిని కూడా ఛార్జ్ షీట్ కు జత చేసి కోర్టుకు సమర్పించింది.

Advertisement

Latest News