నాణ్యతలేని కోటా బియ్యం - పట్టణ ప్రజల ఆరోపణ

By Ravi
On
 నాణ్యతలేని కోటా బియ్యం - పట్టణ ప్రజల ఆరోపణ

MAHESH, MANDAPETA, TPN

మండపేట లో ఈ నెల సరఫరా చేసిన పి డీ ఎఫ్ బియ్యం నాసిరకం గా వుందని ప్రజలు ఆరోపించారు. మండపేట 11 వ వార్డు లో ఏప్రియల్ నెల లో సరఫరా చేసిన కోటా బియ్యం కడిగితేనే నూక మాదిరి తయారు అవుతుందని అక్కడి స్థానికులు ఆరోపించారు. ఆ వార్డు కు చెందిన చుండ్రు సత్యనారాయణ ఆ బియ్యాన్ని కడిగి మీడియా కు చూపించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నాణ్యమైన బియ్యం ఇచ్చేవారని స్థానికులు చెబుతున్నారు. కాగా ఈ సారి కొత్త బియ్యం సరఫరా చేశారని నాణ్యత లేని బియ్యం పేదలకు సరఫరా చేశారని మండి పడుతున్నారు. బియ్యం సరఫరా వాహనం వద్దే  అమ్ముకునే వారికి డబ్బులు వచ్చేస్తున్నాయని, పేదలు మధ్యతరగతి ప్రజలకు ఇదే అన్నం అని అవేదన వ్యక్తం చేశారు. బియ్యం నీటి లో కడిగిన వెంటనే నూక మాదిరి గా అవుతుంది. బియ్యం ముద్దగా ఉడుకుతుంది. దీంతో తినే అవకాశం లేకుండా పోతుందని చెబుతున్నారు. నాణ్యత పరిశించాల్సిన అధికారులు తీరు ను ప్రశ్నిస్తున్నారు. పేదల బియన్ని యదేచ్చగా బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్న పట్టించుకోవడం లేదని విమర్శలు వున్నాయి. దీనిపై పౌర సరఫరాల అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. వచ్చే నెల లో అయినా నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేశారు.

Tags:

Advertisement

Latest News

భారీ వర్షాల ఎఫెక్ట్: పురాతన భవనాన్ని కూల్చివేసిన అధికారులు.. భారీ వర్షాల ఎఫెక్ట్: పురాతన భవనాన్ని కూల్చివేసిన అధికారులు..
హైదరాబాద్: సికింద్రాబాద్.. రాంగోపాల్ పేట.. మెక్లవుడ్ గూడలో శిధిలావస్థకు చేరుకున్న ఒక పురాతన భవనాన్ని జిహెచ్ఎంసి అధికారులు పోలీసుల సహాయంతో కూల్చివేశారు. అయితే ఈ భవనంలో గత...
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నివాసం వద్ద భారీ బందోబస్తు
శ్రీ చైతన్య కళాశాల ఇంచార్జ్ పై కేసు నమోదు..
ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్ లో ఇద్దరు డిఎస్పీల మృతి..
హరిహారవీరమల్లు సినిమా సక్సెస్.. అమ్మవారికి ప్రత్యేక పూజలు
అల్వాల్ ట్రాఫిక్ సీఐ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం
సంకల్ప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దూలపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బూట్లు పంపిణీ