శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నా రెడ్డి గంగమ్మ జాతరలో పాల్గొనటం

On
శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నా రెడ్డి గంగమ్మ జాతరలో పాల్గొనటం

సత్యవేడు, జూన్ 12, 2025

సత్యవేడు గంగమ్మ జాతర వేడుకల్లో భాగంగా గురువారం మధ్యాహ్నం శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నా రెడ్డి గంగమ్మ తల్లిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన నిర్వాహకుడు అడ్వకేట్ గోపీనాథ్ సంప్రదాయ మర్యాదలతో అతిధిగా స్వాగతం పలికారు. ఆయనకు అమ్మవారి చిత్రపటాన్ని బహుమతిగా అందజేశారు.

ఈ సందర్భంగా రవీంద్ర సన్నా రెడ్డి మాట్లాడుతూ, “కులమతాలకతీతంగా ప్రతి ఏటా జరిగే గంగమ్మ జాతరలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉంది. సత్యవేడు ప్రజల శాంతి, సుభిక్షత కోసం అమ్మవారిని ప్రార్థించాను” అని తెలిపారు.

జాతర ఉత్సవాలను వీక్షించిన ఆయన, ప్రజల పాల్గొనదలిని, భక్తి శ్రద్ధలను అభినందించారు. సాంప్రదాయాన్ని నిలబెట్టే ఇలాంటి ఉత్సవాలు సమాజ సమైక్యతకు అద్దంపడతాయని అన్నారు.

Advertisement

Latest News