జనసేన నాయకుల స్థాయి తెలుసుకొని మాట్లాడాలి
ysrcp గుంతకల్లు నియోజకవర్గ అనుబంధ విభాగాల అధ్యక్షులు
- జగన్మోహన్ రెడ్డి మానవత్వం బాధ్యత గురించి జనసేన నాయకులు మాట్లాడడం విడ్డూరంగా ఉంది
- వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించే స్థాయి జనసేన నాయకులకు లేదు
- వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంతకల్లు నియోజకవర్గం అనుబంధ విభాగాల అధ్యక్షులు
గుంతకల్లు జూన్ 27:
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంతకల్ నియోజకవర్గం సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు వై వెంకట్రాంరెడ్డి క్యాంప్ కార్యాలయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం అనుబంధ విభాగాల ఆధ్వర్యంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించటం జరిగింది. ఈ సమావేశంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి వంశీ యాదవ్, యువజన విభాగం గుంతకల్లు నియోజకవర్గం అధ్యక్షుడు అబ్దుల్ భాసీద్, ఎస్టీ సెల్ గుంతకల్లు పట్టణ అధ్యక్షుడు సుగాలి వెంకటేష్ నాయక్, గుంతకల్ పట్టణ జనరల్ సెక్రెటరీ పరుశురామ్ మాట్లాడుతూ రెండు రోజుల కింద గుంతకల్ జనసేన పార్టీ సమన్వయ బాదుడు వాసగిరి మణికంఠ మరియు జనసేన నాయకులు పత్రికా విలేకరు సమావేశంలో మా ప్రియతమా నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతూ మానవత్వం లేదు బాధ్యత లేదు జగన్ ది అంతా రాజకీయ ఉన్మాదమే అంటూ జగన్ లో క్రూరత్వం తప్ప మానవత్వం లేదు అంటూ అనేక మాటలు మాట్లాడడం జరిగింది. దీనికి స్పందిస్తూ ముందు మానవత్వం గురించి మాట్లాడే అర్హత జనసేన పార్టీ నాయకులకు లేదని మానవత్వం అంటే జగన్ జగన్ అంటే మానవత్వం ఈ దేశ చరిత్రలో రాష్ట్రంలో ఉన్న ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజా శ్రేయస్య భావించి ఒక్కసారి మాట ఇస్తే మాట తప్పకుండా సంక్షేమ పథకాలను ప్రజలకు అందించిన గొప్ప మహానేత మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. పల్నాడు జిల్లా పొందిలిలో జరిగినటువంటి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సింగయ్య మరణం మాకు చాలా బాధ అనిపించినీ సింగయ్య మరణాన్ని కూటమి నాయకుల ఆసరాగా తీసుకొని ఆంధ్రప్రదేశ్లో వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన ప్రజా ఆదరణ పెరిగిపోతున్న సందర్భంలో ఎలాగైనా జగన్మోహన్ రెడ్డిని ఇరుకున పాడేసి యాత్రలు ర్యాలీలు సభలు నిర్వహించకుండా చేయాలనేటువంటి ఉద్దేశంతో కూటీమి నాయకులు అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి పైన నిందలు వేయడం సరైనటువంటి పద్ధతి కాదు అన్నారు. జగన్మోహన్ రెడ్డి పొదిలి పర్యటనలో ప్రమాదశాత్తు టాటా సఫారీ (ఏపీ26సివి0001) అనేటువంటి వాహనం తగిలి మరణించడం జరిగిందని ఆ వాహనం జగన్మోహన్ రెడ్డి కాన్వయలో భాగం కాదని సాక్షాత్తుగా ఎస్పీ సతీష్ కుమార్ విలేకరుల సమావేశం నిర్వహించి చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం విశాఖపట్నంలో నిర్వహించినటువంటి యోగాంధ్ర కార్యక్రమంలో 300 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని గిన్నిస్ బుక్ రికార్డు పేరుతో వృధా చేశారని సోషల్ మీడియాలో టీవీ ఛానల్ లో ప్రచారం జరగడంతో ఎలాగైనా యోగేంద్ర అంశాన్ని డైవర్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో కూటమి నాయకులు చేసినటువంటి కుట్రలో భాగమేనని తెలిపారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి గతంలో రాప్తాడు నియోజకవర్గం లో పర్యటించినప్పుడు వేలాదిమంది కార్యకర్తలు ప్రజలు రాప్తాడుకు వచ్చిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డికీ భద్రాచల లోపం కారణంగా హెలికాప్టర్ దెబ్బతిన్న విషయం అందరికీ తెలిసిందే అన్నారు. అదేవిధంగా గుంటూరు మిర్చి యార్డ్ లో మిర్చి రైతుల సమస్యల పైన వెళ్ళినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డికి సైనికుల్లా నిలిచారు అన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రజా ఆదరణ పొందిన నాయకుడిగా ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిల్చున్నారని తెలిపారు.
వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి జెడ్ ప్లస్ కేటగిరి గతంలో ఉన్నప్పటికీ దాని కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలగించిందన్నారు. జగన్మోహన్ రెడ్డి విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ కు వచ్చిన బెంగళూరు ఎయిర్ పోర్టుకు వచ్చిన రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి వెళ్లిన రాష్ట్రంలో ఉన్నటువంటి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కుటుంబాలను కలవడానికి వెళ్ళినప్పుడు గాని వివాహాలకు పరామర్శలకు వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి వెంట వేలాదిగా లక్షలాదిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు యువత విద్యార్థులు యువకులు రాష్ట్ర ప్రజలు స్వచ్ఛందంగా భారీ స్థాయిలో వస్తున్న విషయం కూటమి ప్రభుత్వం జీర్ణించుకోలేక జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా ఈ సభలను ఈ కార్యక్రమాలను ఈ పరామర్శలకు వెళ్లకుండా అడ్డుకోవాలని ఉద్దేశంతో ఓటమి పర్వతం భద్రత కల్పించలేదని అన్నారు. జెడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించిన రోప్ ప్రొటెక్షన్ కల్పించిన ఇలాంటి సంఘటనలు జరిగేవి కాదన్నారు. జగన్మోహన్ రెడ్డి పైన కావాలనే ఉద్దేశపూర్వకంగానే కేసులు పెట్టడం జరుగుతుందన్నారు. గత కొన్ని రోజుల క్రితం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం టిడిపి ఎమ్మెల్యే కార్ ఢీకొని అంగాధర్ రావు అనేటువంటి వృద్ధుడు మరణించినప్పుడు మీరు ఏ విధంగా చర్యలు తీసుకున్నారు. అతని ఏ కారుని సీట్ చేశారు అని చెప్పేసి కూటమి నాయకులను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రశ్నించారు. జనసేన పార్టీకి సంబంధించినటువంటి చిత్తూరు జిల్లాలో బ్యానర్ కడుతూ ముగ్గురు జనసేన యువకులు మృతి చెందారు జగిత్యాలలో పవన్ కళ్యాణ్ కాన్వాయ్ ఢీకొని ఒక యువకుడు మరణించడం జరిగింది అంతే ఎందుకు జనవరి నెలలో జరిగినటువంటి గేమ్స్ చేంజెర్ సినిమా ఫ్రీ రిలీజ్ వెంటుకు వెళ్లి వస్తున్నటువంటి జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ అభిమానులు కాకినాడ జిల్లాకు చెందినటువంటి చరణ్ మణికంఠ ప్రమాదానికి గురై చనిపోయారు. కాకినాడ జేఎన్టీయూ గ్రౌండ్లో సీమాంధ్ర ఆత్మగౌరవ సభ పేరుతో పవన్ కళ్యాణ్ నిర్వహించినటువంటి సభలో తొక్కిసలాటలో వెంకటరమణా అనేటువంటి జనసైనికుడు మరణించడం జరిగింది అన్నారు. చంద్రబాబు గారు గోదావరి పుష్కరాల్లో పాల్గొన్నప్పుడు 23 మంది చనిపోవడం జరిగింది కందుకూరిలో 8మంది చనిపోవడం జరిగింది గుంటూరు చీరల పంపిణీ కార్యక్రమంలో ముగ్గురు మహిళలు చనిపోవడం జరిగింది. 2025-26 చంద్రబాబునాయుడు కాన్వెంట్ ఢీకొని మంగమ్మ ప్రభుత్వ ఉద్యోగి నాగేంద్ర వరప్రసాద్ గారు మరణించడం జరిగింది. విశాఖ సింహాచలం అప్పన్న గుడిలో గోడకూలి 6మంది భక్తులు మరణించడం జరిగింది. తిరుపతిలో వైకుంఠ ద్వారం టికెట్లు జారీ చేసేటప్పుడు 6 మంది భక్తులు మరణించడం జరిగింది. వీరి మరణానికి ఏ రోజైనా చంద్రబాబు నాయుడు గానీ పవన్ కళ్యాణ్ గానీ కూటమి నాయకులు గాని వారి ఇంటికి వెళ్లి పరామర్శలు చేసి ఆర్థిక సహాయం అందించారా అని ప్రశ్నించారు. మరి వీరి పైన ఎందుకు కేసులు నమోదు యొక్క కారణం ఎందుకు సీజ్ చేయలేదు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రశ్నించారు. ప్రశ్నించడానికి పార్టీ పెట్టిన అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రంలో మహిళల పైన విద్యార్థినిలు పైన యువతులు పైన అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నప్పుడు ఎందుకు ప్రశ్నించడం లేదని ప్రశ్నించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి రాజ్యాంగం పేరుతో రాష్ట్రంలో కక్ష సాధింపు దూరంలతో అనేకమందిని పొట్టు పెట్టుకునేది కూడా ప్రభుత్వం కాదని మరి ఎందుకు ప్రశ్నించడం లేదని తెలిపారు. వీటన్నిటికీ పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలని కోరారు. పవన్ కళ్యాణ్ లాగా జాతరలో పూనుకం వచ్చిన వారిలాగా మైకముందు నిలబడి ఇష్టానుసారంగా చెప్పులు చూపించి హాకీ స్టిక్కుల రాడ్ల రాళ్ల రండిరా డాష్ డాష్ అంటూ ఈరోజు కూడా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ విధంగా మాట్లాడలేదు అన్నారు. గుంతకల్ జనసేన బాదుడు మణికంఠ మీరు జగన్మోహన్ రెడ్డి పైన మాట్లాడేంత స్థాయి మీది కాదని గుర్తుంచుకోవాలన్నారు. ఎందుకంటే గుంతకల్లు నియోజకవర్గంలో ఉన్నటువంటి జనసైనికులు మిమ్మల్ని జనసేన బాద్రులు అని చెప్పేసి ఎవరు అనుకోవడం లేదు మీ స్థాయి జగన్మోహన్ రెడ్డిని విమర్శించే అంత స్థాయి మీది కాదు జగన్మోహన్ రెడ్డిని విమర్శించేముందు మీ అర్హత ఏమిటంటే ఒక్కసారి గుర్తు చేసుకొని మాట్లాడాలని చెప్పేసి అన్నారు. మీరు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం సరిపోరని చెప్పే చెప్పారు. ఇప్పటికే మీ మీద గుంతకల్ పట్టణంలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు అనేకమంది మీరు వారి గుర్తించడం లేదని చెప్పేసి జనసేన పార్టీని నిర్వీరం చేస్తున్నారని చెప్పేసి ఆవుడా చైర్మన్ వరుణ్ కి రాష్ట్ర నాయకత్వానికి ఫిర్యాదులు చేశారు వాటిని మళ్లించడానికి మీరు మా జగన్ మోహన్ రెడ్డి పైన ప్రెస్ మీట్ పెట్టి విమర్శలు చేయడం తగదన్నారు. ముందు మీరు మీ జనసేన నాయకులు అందరిని సమన్వయం చేసుకోండి ఆ తర్వాత మా జగన్మోహన్ రెడ్డిపైన మాట్లాడదాం అన్నారు. గుంతకల్ పట్టణంలో 37 వార్డులో మీరు ఎక్కడి నుంచైనా పోటీ చేయండి వార్డ్ మెంబర్ గా మా పార్టి మున్సిపాలివింగ్ జనరల్ సెక్రెటరీ పరుశురాముడు అన్నగారు మీకు పోటీగా నిలబడతారు అది ఇండిపెండెంట్ అయినా పార్టీ పరంగా అయినా వారి పైన గెలిచి చూపించండి అని చెప్పి సవాల్ విసిరారు. జగన్మోహన్ రెడ్డి మానవత్వం పైన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు చేసినటువంటి సేవలు పైన జగన్మోహన్ రెడ్డి అందించినటువంటి పాలన పైన జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అభివృద్ధి పైన గుంతకల్ నియోజకవర్గంలో ఎక్కడైనా గుంతకల్ అజంత సర్కిల్ అయినా గుత్తి గాంధీ సర్కిల్ అయినా పామిడి వైఎస్ఆర్ సర్కిల్ అయినా చర్చకు మేము సిద్ధమని చెప్పేసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాల నాయకులు సవాలు విసిరారు. కసాపురం గుడిలో జనసేన బాధ్యుడు మణికంఠ విఐపి తరహాలో గుడిలో రూల్స్ ను ధిక్కరించి తనకు వేద పండితులతో మంత్రాలతో సకల మర్యాదలు చేయించుకోవడం సిగ్గుచేటు అన్నారు. కసాపురం ఆలయంలో ఒక ఆనవాయితీ ఉందని ఎవరైనా ఎమ్మెల్యే గానీ ఎంపీ గాని లేదా ఎవరైనా ప్రముఖులు సినీ తారలు గానీ మంత్రులు గాని వచ్చిన సందర్భంలో చేయాల్సినటువంటి పద్ధతులను మరిచి ఇలాంటి వారికి ఇలాంటి పద్ధతిలో చేయడం ఒకసారి ఆలోచించాలని కోరారు. ఇప్పటికైనా ప్రెస్ మీట్లను పెట్టేటప్పుడు గానీ బహిరంగ సభల్లో మాట్లాడేటప్పుడు గానీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే రాబోవు రోజుల్లో ప్రజలే మీకు బుద్ధి చెబుతారని తెలిపారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ ఉపాధ్యక్షుడు నవీన్ కుమార్, పట్టణ కార్యదర్శి శివకుమార్, వాలంటీర్ విభాగం నియోజవర్గం అధ్యక్షుడు పవన్, ఐటి వింగ్ నియోజకవర్గ అధ్యక్షుడు రెడ్డి, పబ్లిసిటీ వింగ్ అధ్యక్షుడు రామ్మోహన్, ఎస్సీ సెల్ పట్టణ ఉపాధ్యక్షుడు రాజశేఖర్, యువజన విభాగం పట్టణ అధ్యక్షుడు మనోజ్ కుమార్, కార్యదర్శి రాఖీ, వైయస్సార్ ఎస్ యు పట్టణ అధ్యక్షుడు మణికంఠ, ఐ టివి పట్టణ అధ్యక్షుడు దాదా ఖలందర్, బూత్ వింగ్ జనరల్ సెక్రెటరీ సంజీవ్ కుమార్, 6వ వార్డ్ ఇంచార్జ్ దర్గా నాయుడు,నాలుగవ వార్డు నాయకులు కే మస్తాన్ కే రామాంజనేయులు, అనుబంధ విభాగాల నాయకులు రాము, కొండపల్లి శివకుమార్, కిషోర్ యాదవ్, పవన్ నాయుడు, కేదార్, తరుణ్ తదితరులు పాల్గొన్నారు.