ఘనంగా ‘దేవగుడి’ సినిమా ట్రైలర్ లాంఛ్…
ఈ నెల 30న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్
పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్‌పై బెల్లం సుధారెడ్డి సమర్పణలో, బెల్లం రామకృష్ణారెడ్డి రచన–దర్శకత్వంలో స్వీయ నిర్మాణంగా తెరకెక్కిన చిత్రం ‘దేవగుడి’. అభినవ శౌర్య, నరసింహ, అనుశ్రీ, రఘు కుంచె ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఈ నెల 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో పలువురు సినీ పాత్రికేయుల సమక్షంలో ‘దేవగుడి’ సినిమా ట్రైలర్ లాంఛ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా దర్శక నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ… మీడియా మిత్రుల మధ్య మా సినిమా ట్రైలర్‌ను విడుదల చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ చిత్ర టీజర్‌ను హీరో శ్రీకాంత్ విడుదల చేసి తమకు మద్దతు అందించారని తెలిపారు. స్నేహం, ప్రేమ, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు నిజ జీవిత ఘటనల ఆధారంగా బలమైన కథతో ఈ సినిమాను తెరకెక్కించామన్నారు. స్క్రీన్‌ప్లే చాలా షార్ప్‌గా ఉండి, ఒక్కో సీన్ ఆసక్తికరంగా సాగుతుందని చెప్పారు. ఎక్కడా ల్యాగ్ అనిపించదని, అవసరమైన బడ్జెట్‌తో ఎలాంటి రాజీ లేకుండా సినిమాను నిర్మించామని పేర్కొన్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన సెంటర్లలో సాధారణ టికెట్ రేట్లతో సినిమాను విడుదల చేస్తున్నామని, పైరసీని ప్రోత్సహించకుండా థియేటర్లలోనే చూడాలని విజ్ఞప్తి చేశారు.
హీరో అభినవ శౌర్య మాట్లాడుతూ… హీరో కావడం తన చిన్ననాటి కల అని, ఎన్నో ఆడిషన్లు చేసి, సంవత్సరాల పాటు ఎదురుచూసిన తర్వాత ఈ అవకాశం వచ్చిందన్నారు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా తన టాలెంట్‌ను నమ్మి అవకాశం ఇచ్చిన బెల్లం రామకృష్ణారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. చిన్న సినిమా అని తక్కువగా చూడొద్దని, కొత్త టాలెంట్‌ను ప్రోత్సహిస్తేనే పరిశ్రమ ముందుకు సాగుతుందన్నారు.
హీరోయిన్ అనుశ్రీ మాట్లాడుతూ… ‘దేవగుడి’తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడం గర్వంగా ఉందన్నారు. తన పాత్ర అందరికీ నచ్చేలా ఉంటుందని, పవర్‌ఫుల్ డైలాగ్స్ తనకు ప్రత్యేక గుర్తింపునిస్తాయని చెప్పారు. నటుడు రఘు కుంచె మాట్లాడుతూ… భారీ యాక్షన్ సీక్వెన్సులతో ఈ చిత్రం తన కెరీర్‌లో ప్రత్యేకమని అన్నారు. సంగీత దర్శకుడు ఎస్.కె. మదీన్, డీవోపీ లక్ష్మీకాంత్ కనిక కూడా తమ అనుభవాలను పంచుకుంటూ, ‘దేవగుడి’ ఒక పూర్తి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం వ్యక్తం చేశారు.

.jpeg)