శర్వానంద్ చేతుల మీదుగా ‘బా బా బ్లాక్ షీప్’ టీజర్ విడుదల

On
శర్వానంద్ చేతుల మీదుగా ‘బా బా బ్లాక్ షీప్’ టీజర్ విడుదల

చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్‌పై రూపొందుతోన్న న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ ‘బా బా బ్లాక్ షీప్’ టీజర్‌ను ప్రముఖ స్టార్ హీరో శర్వానంద్ శుక్రవారం విడుదల చేశారు. టీజర్ విడుదల అనంతరం చిత్ర యూనిట్‌ను ఆయన అభినందిస్తూ, సినిమా మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఒకే రోజు జరిగిన అనుకోని సంఘటనతో ఆరుగురు వ్యక్తుల జీవితాల్లో చోటు చేసుకునే పరిణామాలే కథగా రూపొందిన ఈ చిత్రాన్ని దోనేపూడి చక్రపాణి సమర్పణలో వేణు దోనేపూడి నిర్మిస్తున్నారు. గుణి మంచికంటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో టిను ఆనంద్, ఉపేంద్ర లిమాయే, జార్జ్ మరియన్, అక్షయ్, విష్ణు ఓయ్, కార్తికేయ, విస్మయశ్రీ, మాళవి, కశ్యప్, రాజా రవీంద్ర తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

టీజర్ ప్రారంభం నుంచే పచ్చని కొండలు, అందమైన గ్రామీణ నేపథ్యంలో కథను పరిచయం చేస్తూ ఆసక్తిని పెంచుతుంది. “చెప్పుకోడానికి ఇది మామూలు కథ కాదు” అనే డైలాగ్‌తో మొదలయ్యే టీజర్‌లో వెంటనే హాస్యం, ఉత్కంఠ మిళితమైన సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. గన్స్, కార్ చేజింగ్స్‌తో పాటు పాత్రల మధ్య నడిచే సరదా సంభాషణలు టీజర్‌కు ప్రధాన బలంగా నిలిచాయి. పెళ్లి వేడుకలోకి ఎంట్రీ ఇచ్చే మాఫియా డాన్ జాన్ షెల్లీ హిట్లర్ పాత్రలో ఉపేంద్ర లిమాయే లుక్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

టీజర్ మొత్తాన్ని గమనిస్తే సినిమా ఓ బాక్స్, ఓ గన్ చుట్టూ తిరిగే క్రైమ్ కామెడీగా రూపొందిందని స్పష్టమవుతుంది. ఆ బాక్స్ కోసం మాఫియా డాన్ ఎందుకు వెతుకుతున్నాడు? చివరికి అది ఎవరి చేతిలో ఉంటుంది? అందులో ఏముంది? అన్న ప్రశ్నలకు సమాధానం సినిమా చూసినప్పుడే తెలుస్తుందని నిర్మాత వేణు దోనేపూడి తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “మొత్తం సినిమా షూటింగ్‌ను మేఘాలయ రాష్ట్రంలోనే పూర్తి చేశాం. చిరాపుంజి వంటి అద్భుతమైన లొకేషన్స్‌లో చిత్రీకరణ జరిగింది. మేఘాలయలో పూర్తిగా షూటింగ్ జరుపుకున్న తొలి తెలుగు సినిమా ఇదే. పక్కా ప్లానింగ్‌తో తక్కువ రోజుల్లో షూటింగ్ పూర్తి చేశాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తాం” అని చెప్పారు. ఈ చిత్రానికి అజయ్ అబ్రహం జార్జ్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేయగా, స్టీఫెన్, ఆనంద్ సంగీతాన్ని అందించారు. వినోదం, క్రైమ్, స్టైలిష్ ప్రెజెంటేషన్‌తో రూపొందుతున్న ‘బా బా బ్లాక్ షీప్’ టీజర్‌తోనే మంచి బజ్‌ను క్రియేట్ చేసింది.

Advertisement

Latest News

ఘనంగా ‘దేవగుడి’ సినిమా ట్రైలర్ లాంఛ్… ఘనంగా ‘దేవగుడి’ సినిమా ట్రైలర్ లాంఛ్…
పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్‌పై బెల్లం సుధారెడ్డి సమర్పణలో, బెల్లం రామకృష్ణారెడ్డి రచన–దర్శకత్వంలో స్వీయ నిర్మాణంగా తెరకెక్కిన చిత్రం ‘దేవగుడి’. అభినవ శౌర్య, నరసింహ, అనుశ్రీ, రఘు...
సింగరేణిపై జరుగుతున్న కుట్రను తీవ్రంగా ఖండించిన భట్టి విక్రమార్క
గురుడోంగ్మార్ వద్ద ‘మరొక్కసారి’ అరుదైన షూటింగ్
శర్వానంద్ చేతుల మీదుగా ‘బా బా బ్లాక్ షీప్’ టీజర్ విడుదల
లిక్కర్ స్కామ్‌లో ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి
పట్టించుకోనట్లే ఉంటూ అన్నీ పట్టించుకుంటున్నాడు – పవన్ కల్యాణ్ రాజకీయ వ్యూహం..
మింగేసింది అంతా..కక్కించిన హైడ్రా..