తన విషయం తండ్రికి చెప్పాడని కొడవలితో దాడి..
తాండూరు: మద్యం తాగుతున్నాడని తండ్రికి ఫిర్యాదు చేయడంతో ఓ మైనర్ బాలుడు కక్ష్య పెంచకుని ఆ వ్యక్తిపై కొడవలితో దాడి చేశాడు. తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నబాధితుడు ఆసుపత్రి పాలయ్యాడు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ఎక్మయి గ్రామంంలో చోటుచేసుకుంది. బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం. ఎక్మయి గ్రామానికి చెందిన మారేప్ప వ్యవసాయ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వారి ఇంటి సమీపంలో ఉండే మైనర్ బాలుడు గత కొంత కాలంగా మద్యానికి బానిసగా మారినట్లు పుకార్లు ఉన్నాయి. బాలుడు చేస్తున్న చేష్టలపై కొన్నిసార్లు మందలిస్తూ బాధితుడు మారేప్ప అతని తండ్రికి తెలిపాడు. శనివారం గ్రామంలో జరిగే పీర్లపండగ వద్ద కూడా మారెప్ప, మైనర్ బాలుడి మద్య వివాదం మళ్లీ జరిగింది.ఇదే విషయంమై మనసులో కక్ష్య పెంచుకున్న మైనర్ బాలుడు ఇంట్లో ఉన్న కొడవలి తీసుకవచ్చి ఆదివారం మారెప్ప మెడ భాగంలో దాడి చేశాడు. తప్పించుకునే క్రమంలో తలపై కూడా గాయాలయ్యాయి. వెంటనే మైనర్ బాలుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. గాయాలపాలైన మారెప్పను చికిత్స నిమిత్తం తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు విచారణ జరిపి మైనర్ బాలున్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.