రంగారెడ్డి జిల్లాలో రెండో రోజు ఆర్టీఏ తనిఖీలు – 12 ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులు సీజ్
రంగారెడ్డి, జూన్ 13:
రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఆర్టీఏ అధికారులు ఫిట్‌నెస్, భద్రతా ప్రమాణాలను ఉల్లంఘిస్తున్న స్కూల్ బస్సులపై రెండో రోజు కూడా తనిఖీలు నిర్వహించారు.
లంగర్ హౌస్ టిప్పుఖాన్ బ్రిడ్జి వద్ద విద్యార్థులను తరలిస్తున్న ప్రైవేట్ స్కూల్ బస్సులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. నిబంధనలను తృణప్రాయంగా తీసుకుంటున్న యాజమాన్యంపై మండిపడ్డారు.
ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లేకుండా నడుస్తున్న 12 బస్సులను సీజ్ చేశారు. ఇలాంటి బస్సుల్లో విద్యార్థులను తరలిస్తున్న యజమానులపై సీరియస్‌గా వ్యవహరించనున్నట్లు తెలిపారు.
ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్న అధికారులు, అవసరమైన ప్రమాణాలు లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పలు మార్లు హెచ్చరించినా యాజమాన్యాలు పట్టించుకోకపోవడంతో నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది.
స్కూల్ యాజమాన్యాలు విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆపాలని, తగిన నిబంధనల ప్రకారం వాహనాలు నిర్వహించాలని అధికారులు సూచించారు.