అయ్యబాబోయి.. అక్కడ రాత్రికి రాత్రే సమాధులు మాయం..

On
అయ్యబాబోయి.. అక్కడ రాత్రికి రాత్రే సమాధులు మాయం..

  • తమ పూర్వీకుల అస్థికలు కావాలంటూ బాధితుల ఆందోళన..
    సమాధుల మాయం వెనుక మూవీ డిస్టిబ్యూటర్..
    ఆ స్థలం కోసం దారుణానికి ఒడిగట్టిన దుండగులు..

మనం బంగారం మాయం.. మన వాహనాలు మాయం.. లేదా ఇంట్లో వస్తువులు మాయం అంటూ వార్తలు వింటాము.. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్లు కూడా ఉంటాయి. కానీ అక్కడ రాత్రికి రాత్రి సమాధులు మాయం అయ్యాయి. అందులోని అస్థికలు కనిపించకుండా పోయాయి. అంతే ఆ ప్రాంతం మొత్తం కలకలం రేగింది. చుట్టుపక్కల జనం అక్కడ పొగయ్యారు.. ఆ సమాధులకు చెందిన కుటుంబ సభ్యులు అక్కడికి వచ్చారు. ఘటన చూసి బోరున విలపించారు.  ఎవరు చేశారు.. క్షుద్రపూజలు చేయడానికా అంటూ చర్చ మొదలైంది. ఆ తరువాతే అసలు కథ బయటకు వచ్చింది. దాని వెనుక  ఓ మూవీ డిస్టిబ్యూటర్ ఉన్నాడని తెలిసింది. అయితే సినిమా కోసం మాత్రం కాదు... దాని వెనుక ఓ పెద్ద కదా ఉంది..
మహేశ్వరం మండలం డబిల్ గూడ గ్రామంలో సర్వే నంబర్ 24 లో ఉన్న దళిత కుటుంబానికి చెందిన మూడు సమాధులు ఉన్నాయి. జన్యపాగ కుటుంబ సభ్యులు 2006 సంవత్సరంలో మూడు ఎకరాల 5 గుంటల తమ భూమిని అమ్మారు. ఆ సమయంలో  సమాధుల కోసం ఒక గుంట భూమిని వదిలి పెట్టారు. అయితే తాము కొన్న స్థలానికి సమాధులు అడ్డుగా ఉన్నాయని  రియల్టర్ రవివర్మ ఆ సమాధులను రాత్రికి రాత్రి వాటిని తొలగించాడని బాధితులు ఆరోపించారు. చివరకు సమాధి లోపల అస్తికలు లేకుండానే  తీసి వేశారని, అవి తమ పూర్వీకుల అస్థికలని, తమకు కావాలని కుటుంబ సభ్యులు సమాధుల వద్ద బోరున విలపించారు. అధికారులు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.
అయితే ఆ స్థలం కొన్న రియల్ ఎస్టేట్ వ్యాపారి మైత్రి మూవీ డిస్టిబ్యూటర్ రవివర్మ అని ఆభూమి వాళ్లకు ఇవ్వనందుకు ఈ విధంగా చేశారన్నారని మండిపడ్డారు. కబ్జాదారుల నుండి మా పూర్వీకుల అస్థికలు ఇప్పించవలసిందిగా భూమి పట్టాదార్ జన్యపగా బాలమణి కోరారు. లేదంటే ఆ సమాధుల వద్దే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ ఘటనపై స్థానిక పలు పార్టీల నేతలు స్పందించి బాధితులకు అండగా నిలిచారు. ఈ ఘటనపై రియల్టర్ రవివర్మ నుండి మాత్రం ఎలాంటి స్పందన లేదు. సమాధుల మాయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Latest News