ఘనంగా సీఆర్పీఎఫ్ రెండవ సిగ్నల్ బెటాలియన్ ఆవిర్భావ వేడుకలు..
దేశ రక్షణ.. సైన్యం రక్షణలో ప్రాణాలను అర్పించడంలో సిఆర్పిఎఫ్ ఎప్పుడూ ముందు ఉంటుందని పలువురు అధికారులు అభిప్రాయ పడ్డారు. రెండో సిగ్నల్ బెటాలియన్ ఆవిర్భవించి నేటికి 57 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. రెండో సిగ్నల్ బెటాలియన్ కమాండెంట్ ఓం హరి, డిప్యూటీ కమాండెంట్ ఉత్తమ్ బెనర్జీ ఆదేశాల మేరకు, సిఆర్పిఎఫ్ గ్రూప్ సెంటర్ చాంద్రాయణగుట్టలో త్రిభువన్ ప్రతాప్ సింగ్, విశ్వనాథ్, ఎన్.వి.రావు ఆధ్వర్యంలో రెండో సిగ్నల్ బెటాలియన్ రైజింగ్ డే వేడుకలు రెండో సిగ్నల్ జవాన్ల కుటుంబ సభ్యులతో కలిసి నిర్వహించారు. ఈ వేడుకలో కుటుంబ సభ్యులు, చిన్నారులు తమ ప్రతిభను ప్రదర్శిస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు. రెండో రోజు అన్ని బెట్టాలియన్ల జవాన్లు ముందుకు వచ్చి థలాసేమియా బాధితుల కోసం రక్తదానం చేశారు. రెండో సిగ్నల్ కమాండెంట్ ఓం హరి మాట్లాడుతూ, ఈ బెటాలియన్ ఆవిర్భవించి 57 సంవత్సరాలు పూర్తవడంతో మా బెటాలియన్ కుటుంబ సభ్యులతో కలిసి రైజింగ్ డే వేడుకలను నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా సీఆర్పీఎఫ్ బెట్టాలియన్ల పనితీరును గుర్తు చేసుకున్నారు.