వండర్ లా వద్ద వ్యాపారస్థుల ఆందోళన.. పిఎస్ లో ఫిర్యాదు

On
వండర్ లా వద్ద వ్యాపారస్థుల ఆందోళన.. పిఎస్ లో ఫిర్యాదు

రంగారెడ్డి జిల్లా: ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో వండ ర్ లా వద్ద వ్యాపారస్తులు ఆందోళనకు దిగారు. వండర్ లా కు  వెళ్లే వాహనాలను, వారి సిబ్బందిని బట్టల దుకాణం  వ్యాపారస్తులు అడ్డుకున్నారు. దాదాపు 11 సంవత్సరాలుగా తాము వండర్ లా లోపలికి వెళ్లే దారిలో మా భూమిలో బట్టలు అమ్ముకుంటున్నామని ఒకేసారి వండర్ లా యాజమన్యం వచ్చే కస్టమర్లకు బట్టలు ఫ్రీ ఇస్తున్నాము అని వారికి ఆఫర్ ఇస్తే  చిరు వ్యాపారులం మా పరిస్థితి ఏమిటని ఆందోళన వ్యక్తం చేశారు. పది సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన వండర్ లా లో స్థానిక  గ్రామస్థులకు ఉద్యోగాలు మరియు వండర్ లా పరిసర ప్రాంతంలో దుకాణ సముదాయలు పెట్టుకోవడానికి అంగీకారించారని, దీనితో మా భూములు పార్క్ కు ఇచ్చామని చెప్పారు.  పార్కుకు దారిలో ఉన్న భూము మావే  మరి మా భూములలో మేము బట్టల దుకాణాలు మొదట వేసుకొమ్మని చెప్పి ఇప్పుడు మా పొట్ట మీద కొట్టడంపై షాప్ యజమానులు ఆవేదన వ్యక్తంచేశారు. వండర్ లా వల్ల గ్రామస్తులు అందరూ వండ ర్ లా పరిసరాలు  జీవనోపాధి పొందుతున్నారని తెలియజేశారు. ఎప్పుడు యాజమాన్యం సూట్ అంటూ కోడింగ్ ఏర్పాటు చేసి వారి వ్యాపారాలను దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తున్నారని వాపోయారు. వ్యాపారస్తులను  పోలీసులు మరియు యాజమాన్యం వేధిస్తున్నాయంటూ తెలియజేసిన వ్యాపారస్తులు అనంతరం వండర్ లా యాజమాన్యంపై ఆదిభట్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

Advertisement

Latest News

పక్కా ప్లాన్ ప్రకారమే చేశా.. యాంకర్ స్వేచ్ఛ కేసులో పూర్ణ స్టేట్మెంట్. పక్కా ప్లాన్ ప్రకారమే చేశా.. యాంకర్ స్వేచ్ఛ కేసులో పూర్ణ స్టేట్మెంట్.
ఓ పథకం ప్రకారం ఆమెకు దగ్గరైననమ్మకం కోసం కేటిఆర్, కవిత, సంతోష్ కుమార్ ని కల్పించాఅలా నాలుగేళ్లు ఆమెతో వున్నాను..చనిపోతా అంటే నచ్చినట్లు చేయమన్నపూర్ణచందర్ రావు రిమాండ్...
డ్రగ్స్ దందాలో నయా ట్రెండ్.. ఇంపోర్టు టు ఎక్స్ పోర్ట్..
ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడు ఆయనే.. అధిష్టానం సంచలన నిర్ణయం
ట్రూ పాయింట్ న్యూస్ కి స్పందన.. సున్నం చెరువులో అక్రమ బోర్ల ధ్వంసం
పాశమైలారం పారిశ్రామికవాడలో భారీ ప్రమాదం
ఆ నీళ్లు మీరు తాగుతున్నారా.. అయితే ఖచ్చితంగా పోతారు..
వివాదానికి దారితీసిన బల్కంపేట దేవాలయ కమిటీ ఏర్పాటు