దుండిగల్ లో రోడ్డుప్రమాదం.. తల్లి ఎదుటే కుమారుడు మృతి

On
దుండిగల్ లో రోడ్డుప్రమాదం.. తల్లి ఎదుటే కుమారుడు మృతి

మేడ్చల్ జిల్లా: దుండిగల్ పిఎస్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. మల్లంపేట్ లోగల పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ ముందు రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తల్లితో పాటు స్కూల్ కి వెళ్తున్న 1వ తరగతి బాలుడిని టిప్పర్ లారీ ఢీకొంది. ఘనటనలో తల్లికి గాయాలు కాగా, బాలుడు అక్కడిక్కడే మృతి చెందాడు. ప్రాధమిక దర్యాప్తులో మృతి చెందిన బాలుడు అభిమాన్షు రెడ్డి (6) సంవత్సరాలుగా గుర్తించారు. బాలుడు  బౌరంపేట గీతాంజలి స్కూల్లో ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడని పోలీసులు తెలిపారు. స్పాట్ కి వచ్చిన పోలీసులు సిసి ఫుటేజ్ సేకరించి దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Latest News