తనిఖీలకు వెళ్లిన కానిస్టేబుల్ గుండెపోటుతో మృతి

On
తనిఖీలకు వెళ్లిన కానిస్టేబుల్ గుండెపోటుతో మృతి

మేడ్చల్ జిల్లా: కుత్బుల్లాపూర్ ఓ ఇంట్లో గంజాయి అమ్ముతున్నారని సమాచారంతో తనిఖీలకు వెళ్తున్న క్రమంలో బాలానగర్ జోన్ ఎస్ఓటి కానిస్టేబుల్ నిల్చున్న చోటే కుప్పకూలిపోయాడు. వెంటనే గమనించిన తోటి సిబ్బంది చింతల్లో ఆసుపత్రికి తరలించగా అప్పటికే కానిస్టేబుల్ ప్రవీణ్(39) మృతిచెందాడని వైద్యులు తెలిపారు. అతన్ని పరిశీలించిన వైద్యులు గుండెపోటుగా అనుమానం వ్యక్తం చేశారు. మృతదేహం గాంధీ మార్చురికి తరలించారు. మృతుని ప్రవీణ్ భార్య పేరు జానకీ దేవి 33, వీరికి ఒక కొడుకు ఉన్నాడు. మృతుడు ప్రవీణ్ వివిధ పోలీస్ స్టేషన్ లలో సనత్ నగర్, మియాపూర్సూ, సురారంలో పని చేయగా ప్రస్తుతం బాలానగర్ ఎస్ఓటిIMG-20250622-WA0016లో విధులు నిర్వహిస్తున్నాడు.

Advertisement

Latest News